APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..

APSRTC Dussehra festival: ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని రూట్లలో భారీగా బస్సు ప్రయాణాలలో రాయితీలను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
 

1 /6

ప్రస్తుతం దేశంలో పండగ సీజన్ నడుస్తోంది. చాలా మంది దసరా పండగకు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు . కొంత మంది ఇప్పిటికే తమ సొంత వాహనాల్లో వెళ్లిపోతే, మరికొందరు బస్సులు, రైల్వే ఇతర ప్రత్యామ్నాయాలలో తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. దసరా పండుగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపికబురు చెప్పినట్లు తెలుస్తోంది.

2 /6

మెయిన్ గా.. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే బస్సుల్లో టికెట్లపై రాయితీ ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి, వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీ వర్దిస్తుందని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

3 /6

ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఈ బస్సు ప్రయాణంలో రాయితీ అప్లికేబుల్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఆదివారం (అప్‌), శుక్రవారం (డౌన్‌)లను మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ సిబ్బంది వెల్లడించారు. ఈ మేరకు ఆయా రూట్లలో, ఆ బస్సుల్లో ఛార్జీల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.

4 /6

 ప్రస్తుతం సీజన్ లను బట్టి బస్సు ప్రయాణ చార్జీలలో వ్యత్యాసాలు ఉంటాయి,.  కొన్నిసార్లు చార్జీలు నామమాత్రంగా ఉంటే.. దసర, పండుగల సీజన్ లలో డబుల్ చార్జీలను డిమాండ్ లను బట్టి ఆర్టీసీ వసూలు చేస్తారు. దీంతో ఆయా మార్గాలలో బస్సు రూట్ లలో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతుందని తెలుస్తోంది.  

5 /6

ఇదిలా ఉండగా.. హైదరబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా బెంగళూరుకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అందుకు హైదరబాద్, బెంగళూరు రూట్ల లోని డాల్ఫిన్ క్రూయిజ్ , వెన్నెల,అమరావతి, స్లీపన్ ఏసీ బస్సులలోఈ 10 శాతం రాయితీ వర్తిస్తుందని తెలుస్తోంది.  

6 /6

ఈ ప్రత్యేక వర్తింపు అనేది కేవలం..  ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆర్టీసీ అధికారులు కోరారు. మరోవైపు దసరాకు రద్దీకి తగ్గట్లుగా సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. అక్టోబర్ 3 నుంచి 15 వరకు బస్సులు నడవనున్నాయి. విజయవాడకు రాకపోకలు సాగించేందుకు.. అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు.