Devara Movie HD Print Leaked Online: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈరోజు సెప్టెంబర్ 27న…ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
అసలు ఫ్లాప్స్ అంటే ఏమో తెలియని కొరటాల శివ.. చిరంజీవి ఆచార్య సినిమాతో డిజాస్టర్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే మరలా దేవర.. చిత్రంతో ఈ దర్శకుడు పుంజుకుంటారా లేదా అని అందరూ చూస్తూ. ఇక మరోపక్క రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావదంటే.. ప్రపంచమంతా ఈ సినిమా కోసం ఎదురుచూసింది. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులను ఖుషి చేస్తూ.. ఈ సినిమా సూపర్ హిట్ వైపు దూసుకుపోతోంది.
ముఖ్యంగా దసరాకి ఎటువంటి సినిమా విడుదలలు లేకపోవడంతో.. అంతేకాకుండా డిసెంబర్ 6 పుష్ప విరుదల వరకు మరో స్టార్ హీరో చిత్రం కూడా థియేటర్స్ లో పడే ఛాన్స్ లేకపోవడంతో.. దేవర సినిమా తప్పకుండా లాంగ్ రాన్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.. అని ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.
కాగా ఇలాంటి టైం లో ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలైన కొద్ది గంటలకే.. ఈ చిత్రం హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఈ చిత్రం దాదాపు మూడు గంటల రన్‌టైమ్ తో రాగా.. సినిమా మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టేయడంతో..సినీ ప్రేక్షకులు, అలానే చిత్ర యోని షాక్ కి గురవుతున్నారు. మరి ఈ పైరసీ దెబ్బ నుంచి దేవర ఎలా బయట పడుతుందో చూడాలి.
కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎర్ర సముద్రం చుట్టూ ఉండే నాలుగు ఊర్లకు.. దేవర మాటే శాసనంగా ఉంటుంది. అక్కడ కొద్ది రోజులు సముద్రం నుంచి కొన్ని వస్తువులను తరలిస్తూ వచ్చే దేవర.. ఆ తరువాత ఆ పని తప్పని తెలుసుకొని.. తనతో ఉన్నవారికి కూడా సముద్రం వైపు వెళ్లొద్దు అని చెబుతారు. కానీ డబ్బుకు ఆశపడిన కొంతమంది.. బైరా (సైఫ్ అలీ ఖాన్) తో చేతులు కలిపి కొన్ని అక్రమాలకు పాల్పడతారు. సముద్రం వైపు వెళ్లే వారిని అందరిని శిక్షిస్తూ వచ్చే దేవర కొద్ది రోజులకు ఊరికి దూరమవుతారు. కాగా దేవర కొడుకు వర పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం విశేషం. ఇక ఆ తరువాత దేవర అలానే ఎంతో పిరికిగా ఉందే అతని కొడుకు వర ఏం చేశారు అనేది మిగిలిన కథాంశం.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.