Juice For Diabetes Control: మధుమేహం అనేది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధి..ఈ వ్యాధి బారిన పడితే శరీరం మొత్తం నాశనం అవుతుంది. ప్రస్తుతం కోట్లాది మంది ఈ మధుమేహం బారిన పడుతున్నారు. గతంలో కేవలం వృద్దుల్లో ఈ సమస్య వచ్చేది.. కానీ ఆధునిక జీవనశైలి పాటించే చాలామందిలో ఇప్పుడు డయాబెటిస్ వస్తోంది. ఇందులో కొంతమందిలో ఈ మధుమేహం ఆహారపు అలవాట్ల కారణంగా కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇలా పెరగడం తగ్గడం కారణంగా భవిష్యత్తులో అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎప్పుడూ నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది మార్కెట్లోని లభించే ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
టమాటో రసం:
టమాటో జ్యూస్‌లో తక్కువ కేలరీలు లభిస్తాయి. అంతేకాకుండా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో చక్కెర జాతకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తీవ్ర డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు టమాటోలతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పెరుగుతున్న రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
ఉసిరి రసం:
ఉసిరి రసంలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ రసం:
మధుమేహంతో బాధపడే వారికి కాకరకాయ రసం కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి తీవ్ర డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు తప్పకుండా కాకరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook