Bloating Relief Drinks: సీరియల్‌గా ఐదు రోజులపాటు పండగలు రావడంతో చాలామంది స్వీట్లు, ఇతర అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ శీతాకాలంలో అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల పొట్ట సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామందిలో ఆయిల్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఉబ్బరం, గ్యాస్, ఆసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను తరచుగా వినియోగిస్తూ ఉంటారు. ఇకనుంచి వీటిని వినియోగించడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను పాటించి సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీలకర్ర నీరు:
పొట్ట సమస్యలకు జీలకర్ర నీరు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తినడం కారణంగా ఏర్పడే పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మూడు పూటల పాటు ఈ జీలకర్ర నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
సోంపు నీరు:
చాలామంది సోంపును నోటి నుంచి దుర్వాసన రాకుండా వినియోగిస్తూ ఉంటారు. అయితే సోంపును జీర్ణక్రియ సమస్యలకు కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు సోంపు పొడిని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఈ నీరు శరీరాన్ని రక్షిస్తాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
వాము నీరు:
శీతాకాలంలో దగ్గు, జలుబు, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు వాము నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియను ఆరోగ్యంగా చేసి పొట్టను హాయిగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
రాక్ సాల్ట్ వాటర్:
ఈ రాక్ సాల్ట్ వాటర్ తాగడం వల్ల కూడా పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు పొట్ట ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణ క్రియ మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ రాక్ సాల్ట్ వాటర్ ని తాగాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook