Nepal Earthquake 2023: నేపాల్ భూకంపం ధాటికి ఆ దేశంలో రెండు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం ప్రభావం 500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర భారతం వరకూ వ్యాపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా సంభవించిన భూకంపంలో మరణాల సంఖ్య 132కు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
శుక్రవారం అర్ధరాత్రి..అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. 6.4 తీవ్రతతో భూమి కంపించడంతో చాలావరకూ ఇళ్లు నేలకూలాయి. వాయువ్య నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుం జిల్లాల్లో సంభవించిన భూకంపం ధాటికి పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 132 మంది మరణించారు. శిధిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. జాజర్‌కోట్ జిల్లాలో ఎక్కువగా ప్రభావం చూపించింది. ఈ జిల్లాలో 92 మంది మృత్యువాత పడ్డారు. ఇక రుకుం జిల్లాలో 40 మంది మరణించారని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నారాయణ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు.
భూకంప కేంద్రం జాజర్‌కోట్ జిల్లా రమిదండలో కేంద్రీకృతమైందని, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. నేపాల్ భూకంపం ప్రభావంతో ప్రకంపనలు 500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించాయి. ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో నేపాల్ భూకంపం ప్రభావం కన్పించింది. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్ సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Also read: Nepal Earthquake 2023: నేపాల్‌లో భారీ భూకంపం, 70మందికి పైగా మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook