Benefits of Sun Flower Seeds: ప్రపంచంలో అందమైన పూలలో పొద్దు తిరుగుడు పువ్వు కూడా ఒకటి. పొద్దు తిరుగుడు పూలు చూడడానికి అందంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా లాభదాయకమైనది. పొద్దు తిరుగుడు గింజల్లో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటి వలన కలిగే లాభాల గురించి తెలిస్తే ఆశ్ఛర్యపోతారు. పొద్దు తిరుగుడు పూల గింజల వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పొద్దు తిరుగుడు గింజల వల్ల కలిగే 5 ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన గుండె కొరకు..
పొద్దుతిరుగుడు విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ గింజలో ఫ్లేవనాయిడ్లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు మరియు విటమిన్లు ఉంటాయి. తరచూ పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కాన్సర్ నివారణ
పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల మహిళల్లో వచ్చే రొమ్ము కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ గింజలలో లిగ్నాన్స్ అనబడే ఒక పాలిఫెనాల్ ఉంటుంది,ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ లా పని చేస్తాయి.
కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
పొద్దు తిరుగుడు గింజల ద్వారా శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ స్థాయి ని నియంత్రించవచ్చు. ఈ పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే ఒమేగా ఆసిడ్ రక్త ప్రసరణ మెరుగుపరచి రక్త పోటు నియంత్రణలో ఉపయోగపడుతుంది మరియు బ్లడ్ షుగర్,కొలెస్ట్రల్ తగ్గిస్తుంది.
Also Read: Amla Fruit Juice : శీతాకాలం ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెట్టే జ్యూస్..
ఎముకల ఆరోగ్యానికి..
పొద్దు తిరుగుడు విత్తనాలలు ఐరన్,జింక్ మరియు కాల్షియమ్ కలిగి ఉంటాయి ,ఇవి ఎముకలు దృడంగా,ఆరోగ్యాంగా ఉండడానికి సహాయపడతాయి
మానసిక ఆరోగ్యానికి..
పొద్దు తిరుగుడు విత్తనాలు మానసికంగా ఆరోగ్యాంగా ఉండడానికి దోహదపడుతుంది.ఈ గింజల్లో పోషక విలువలు కలిగిన కాల్షియమ్ మరియు జింక్ ఉంటాయి,ఇవి మానసిక వికాసానికి తోడ్పడుతాయి.
Also Read: CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Benefits of Sun Flower Seeds: పొద్దు తిరుగుడు గింజల వల్ల కలిగే లాభాలు తెలుసా..?