Homemade Lip balm: ఈ హోమ్ మేడ్ లిప్ బామ్స్ తో చలికాలం లో కూడా మీ పెదవులు పదిలం..

Lip balm:చలికాలం వస్తుంది అంటే పెదవులు పొడిబారి సమస్య సర్వసాధారణం అవుతుంది. చాలామందికి ఇది ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఏదైనా తినాలన్నా మంట పుట్టెంతగా పెదాలు పగిలిపోతాయి. ఈ చలికాలం మీ పెదాలను, ఇంటి వద్దనే తయారు చేసుకున్న లిప్ బామ్స్ తో ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 05:18 PM IST
Homemade Lip balm:  ఈ హోమ్ మేడ్ లిప్ బామ్స్ తో చలికాలం లో కూడా మీ పెదవులు పదిలం..

Homemade Lip balm:చలికాలంలో చాలామందికి పెదవులు డ్రైగా అయిపోవడమే కాకుండా పగులుతాయి. పెదవులకు సరైన తేమ అందనప్పుడు అవి వాటి సహజ మృదుత్వాన్ని కోల్పోయి.. పొడిబారి పోతాయి. అయితే  ఇంటి వద్దనే తయారు చేసుకున్న నేచురల్ లిప్ బామ్స్ ఉపయోగించి మీ పెదాలను ఎంతో సహజంగా మృదువుగా మార్చుకోవచ్చు. పైగా ఇంటి వద్ద చేసుకునే ప్రొడక్ట్స్ బయట దొరికే ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే చాలా న్యాచురల్ ..సేఫ్ కూడా. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.. పెద్ద ఖర్చు కూడా అవ్వదు. మరి ఇంట్లోనే ఈజీగా చేసుకుని ఆ లిప్  బామ్స్ ఏమిటో చూద్దాం పదండి..

దానిమ్మ:

దానిమ్మ గింజల్లో తేమ శాతం బాగా ఉంటుంది కాబట్టి అది పెదవుల మృదుత్వాన్ని కాపాడుతుంది. మూడు చెంచాల వడ కట్టిన దానిమ్మ రసానికి రెండు చెంచాల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మందపాటి గిన్నెలో పోసి సన్న మంటపై కాస్త దగ్గర పడే వరకు వేడి చేయాలి. ఇది ఆరిన తర్వాత ఏదైనా క్లీన్ గా ఉన్న చిన్న బాక్స్ లో పోసి ఫ్రిజ్లో భద్రపరచాలి. ఇలా తయారు చేసుకున్న లిప్ బామ్ ఒక 15 రోజుల పాటు వాడుకోవచ్చు.

బీట్‌రూట్‌

బీట్రూట్ పెదాలకే కాదు ముఖానికి, జుట్టుకి చాలా మంచిది. మామూలుగా మార్కెట్లో దొరికే బీట్రూట్ పౌడర్ అయినా వాడొచ్చు లేకపోతే ఇంటి వద్దనే ఒక రెండు బీట్రూట్లను బాగా తురిమి ఎండబెట్టి పొడి చేసి వాడుకోవచ్చు. గ్లాస్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీ, రెండు టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ మిక్స్ చేసి డబల్ లేయర్ బాయిలింగ్ టెక్నిక్  ద్వారా పౌడెర్ , జెల్లీ బాగా మిక్స్ అయ్యేవరకు వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని చిన్న బాక్స్ లో తీసి ఆరనిచ్చి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు.

కోకో పౌడర్‌

రెండు టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీ కి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక క్లీన్ గా ఉన్న డబ్బాలో తీసి చల్లారనిచ్చి ఫ్రిజ్లో భద్రపరచుకొని వాడుకోవచ్చు.

ఇలా కేవలం వీటితోనే కాకుండా రోజా రెక్కలు, మందార పువ్వులు, షియా బటర్ వంటివి కూడా ఉపయోగించి లిప్ బామ్స్ ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. చాలా వరకు ఇలా తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఖర్చు తక్కువ అవ్వడమే కాకుండా మన శరీరంపై కెమికల్స్ వాడకం కూడా బాగా తగ్గుతుంది.

గమనిక: పైన అందించిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కొత్తవి ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News