Diabetes Tips: మధుమేహం ఎంత ప్రమాదకరమో అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. మధుమేహం ఉన్నప్పుుడు ప్రధానంగా చేయాల్సింది డైట్ కంట్రోల్. ఏవి తినాలి, ఏవి తినకూడదనేది పక్కాగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మధుమేహ వ్యాధిగ్రస్థులు అస్సలు తినకూడదు
మధుమేహం అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తున్న అనారోగ్య సమస్య. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధికి నియంత్రణ ఒక్కటే మార్గం. వేళ్లతో సహా ఈ వ్యాదిని నయం చేయడం ఇప్పటి వరకూ అసాధ్యం. ఎందుకంటే మధుమేహానికి ఇంకా చికిత్స లేనేలేదు. డయాబెటిస్ వ్యాధి ఉన్నప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవచ్చు. ముందుగా స్వీట్స్ పూర్తిగా మానేయాలి. స్వీట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. ఆరోగ్యం పాడవుతుంది. అదే సమయంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
వాస్తవానికి మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎలాంటి పండ్లు తినాలి, ఏవి తినకూడదనే విషయంలో ఎప్పుడూ పలు సందేహాలుంటాయి. ఎందుకంటే కొన్ని రకాల పండ్లలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. అందుకే ఏవి తినవచ్చు, ఏవి తినకూడదనేది జాబితా తయారు చేసుకోవాలి.
పైనాపిల్ అనేది చాలా రుచికరమైన, పౌష్టికమైన ఫ్రూట్. ఇందులో నేచురల్ షుగర్ ఉంటుంది. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు పైనాపిల్ తినకూడదంటారు. ఈ ఫ్రూట్ తినడం వల్ల సమస్య మరింత పెరిగిపోతుంది.
లిచి కూడా చాలా రుచికరమైందే కాకుండా అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఫ్రూట్. మధుమేహం వ్యాధిగ్రస్థులు లిచి తినకూడదు. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే బ్లడ్ షుగర్ రోగులు ఈ ఫ్రూట్ తింటే సమస్య మరింత పెరగవచ్చు.
మామిడిని పండ్లకు రారాజుగా పిలుస్తారు. మామిడి పండు అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. అందరూ అమితంగా ఇష్టపడే పండు ఇది. మీరు ఒకవేళ డయాబెటిస్ రోగి అయితే మామిడి అనేది విషంతో సమానమని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పోషక విలువలు ఎంత ఎక్కువో మధుమేహం వ్యాధిగ్రస్థులకు అంత ప్రమాదకరం. షగుర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి.
అరటి పండు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇందులో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవు. ఇదొక ఎనర్జీ ఫ్రూట్. అయితే మధుమేహం వ్యాధిగ్రస్థులు మాత్రం అస్సలు తినకూడదు. బాగా పండిన అరటి పండ్లు తింటే మరీ ప్రమాదకరం. షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరుగుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ.
Also read: Low BP Remedy: మీరు తరచూ లో బీపీతో బాధపడుతుంటే..ఈ ఆయుర్వేద చిట్కా ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Diabetes Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులకు అత్యంత ప్రమాదకరమైన 4 పండ్లు ఇవే