Samsung Galaxy F54 5G Price: మార్కెట్‌లో సాంసంగ్ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మొబైల్స్ అతి తక్కువ ధరలో లభించడమేకాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం F సిరీస్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై మార్కెట్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో Samsung Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్ 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్‌ను ఎమ్‌ఆర్‌పీ ధర రూ.35,999కు విక్రయిస్తోంది. అయితే ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా 16 శాతం తగ్గింపుతో ఫ్లిఫ్‌కార్ట్ రూ.29,999కే విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F54 5G కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Samsung Axis బ్యాంక్ కార్డ్ వినియోగించి కూడా బ్యాంకు ఆఫర్స్‌ను పొందవచ్చు. ఈ బ్యాంకుతో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకుతో ఈ మొబైల్‌ను బిల్ చేల్లిస్తే 5 శాతం తగ్గింపు పొందవచ్చు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వినియోగించే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి దాదాపు రూ. 24,099 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ Samsung Galaxy F54 స్మార్ట్ ఫోన్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.5,900లకే పొందవచ్చు.
Samsung Galaxy F54 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్
Exynos 1380 చిప్‌సెట్
108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
25 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్
USB టైప్-సి పోర్ట్
Android 13 ఆధారంగా OneUI 5.1
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook