Sreeleela Prefers Yoga టాలీవుడ్లో ప్రస్తుతం శ్రీలీల తిరుగులేని ఫాంలో దూసుకుపోతోంది. శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే, రష్మిక మందాన్నలు షెడ్డుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. సమంత పరిస్థితి కూడా అలానే ఉంది. శాకుంతలం డిజాస్టర్‌తో సమంత పరిస్థితి అయోమయంగా మారింది. ఇక శ్రీలీల మాత్రం పది, పన్నెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చేతిలో అన్ని ప్రాజెక్టులన్న హీరోయిన్ టాలీవుడ్లో మరొకరు లేరు. శ్రీలీల దెబ్బకు స్టార్ హీరోయిన్లంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
శ్రీలీల ఇప్పుడు స్టార్ హీరోలకు హాట్ కేక్‌లా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ ఇలా ప్రతీ ఒక్కరూ శ్రీలీలనే ఎంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల పాత్రే హైలెట్ అవుతుందట. ఇక బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలోనూ శ్రీలీల స్పెషల్ రోల్ చేస్తోంది. ఇలా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో శ్రీలీలే కనిపిస్తోంది.
శ్రీలీల తన గ్రేస్, డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంటోంది. ధమాకా సినిమాలో శ్రీలీల కనిపించిన తీరు, డ్యాన్స్‌లు వేసిన విధానం అందరినీ మెప్పించింది. సాయి పల్లవి తరువాత మళ్లీ అంతగా శ్రీలీల డ్యాన్స్ గురించే జనాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు శ్రీలీల తన బ్యూటీ సీక్రెట్ ఒకటి బయటపెట్టేసింది.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
మామూలుగా హీరోయిన్లు జిమ్‌లో తెగ కష్టపడుతుంటారు. బరువులు ఎత్తి వర్కౌట్లు చేస్తుంటారు. కానీ అలాంటివి తనకు నచ్చవని శ్రీలీల చెప్పింది. తాను కేవలం యోగా మాత్రమే చేస్తానని, అది తనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని చెప్పుకొచ్చింది. స్వీటీ అనుష్క తరువాత మళ్లీ యోగా గురించి శ్రీలీలే ఇలా చెప్పేసింది.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK