Sun Transit 2023 Effect: సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. విజయాన్నిచ్చే ఆదిత్యుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈనెల 14 భానుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి రాశి మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి
సూర్య సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.
సింహరాశి
సూర్యుడు రాశి మార్పు కారణంగా మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తోపాటు ప్రమోషన్‌కు అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది.
కన్య రాశి
ఆదిత్యుడి గోచారం వల్ల మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలమే మీ కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read: Mars transit 2023: మే 10న అంగారకుడి రాశి మార్పు.. ఈ రాశులకు లాభాలు బోలెడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook