Toofan Hecharika: ఆసక్తి రేకిస్తోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘తుఫాను హెచ్చరిక’.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Toofan Hecharika: ప్రస్తుతం తెలుగులో కొత్త దనం ఉన్న కథలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ పాద శ్రీ పాద క్రియేషన్స్ పతకంపై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాను హెచ్చరిక’. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 11, 2024, 08:49 PM IST
Toofan Hecharika: ఆసక్తి రేకిస్తోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘తుఫాను హెచ్చరిక’.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Toofan Hecharika: అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన జగదీష్ కెకె డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘తుఫాను హెచ్చరిక’.  డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇది పూర్తి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుంది. తాజాగా విడుదల  చేసిన ఈ మూవీ  ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  
ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ.. "'తుఫాను హెచ్చరిక' ఫస్గ్ లుక్  పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.  ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి లైఫ్ లో  ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగిన తర్వాత..  ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొని విజయం సాధించడనేదే  ఈ సినిమా స్టోరీ.

ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్ కు మా యాక్టర్స్  మరియు సాంకేతిక నిపుణులు ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా యాక్ట్ చేశారు. లంబసింగి మరియు చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్ లో ప్రకృతి అందాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి చూసిన తర్వాత ఈ సినిమాలోని సీన్స్ ను తెరకెక్కించినట్టు వెల్లడించారు.  

హిల్ స్టేషన్ లో ఉండే ఆ ఫ్రెష్ నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు చాలా కష్టపడ్డ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డాక్టర్ రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌ లకు  నా ప్రత్యేక కృజ్ఞతలు.  అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. విడుదల చేస్తాం.
హీరో అల్లు రామకృష్ణ (రాఖి), హీరోయిన్ - సుహానా ముద్వారి ,బ్యానర్ - శ్రీ పాద క్రియేషన్స్ లిమిటెడ్, వింటేజ్ పిక్చర్స్.సమర్పణ - సరయు తలశిల, కొరియోగ్రాఫర్ - ఆది పొన్నస్, లిరిక్స్ - శ్రీమని, ధర్మ గూడూరు కాస్ట్యూమ్స్ - రేణు కియారా, సౌండ్ ఇంజనీర్ - రాధా కృష్ణ,
పోస్టర్స్, లిరికల్ వీడియోస్ - జె కె ఫ్రేమ్స్ దర్శకుడు - జగదీష్ కె కె, నిర్మాతలు - డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్. మాటలు - అరుణ్ వీర్,సినిమాటోగ్రఫీ - వి ఆర్ కె నాయుడు, ఎడిటర్ - జగదీష్ కె కె, ఆర్ట్ డైరెక్టర్ - బత్తుల శివ సాయి కుమార్

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News