Speed 220 Movie Review: ‘స్పీడ్ 220’ మూవీ రివ్యూ రేటింగ్.. ఇంతకీ ఎలా ఉందంటే..!

Speed 220 Movie Review: ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీల అంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు అలాంటి చిత్రాలకు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఇదే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘స్పీడ్ 220’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 6, 2024, 04:29 PM IST
Speed 220 Movie Review: ‘స్పీడ్ 220’ మూవీ రివ్యూ రేటింగ్.. ఇంతకీ ఎలా ఉందంటే..!

నటీనటులు: కొల్లా గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, బజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి,  తదితరులు

ఎడిటర్: అర్రమ్ రామకృష్ణ

సినిమాటోగ్రఫీ: కొణిదెన క్రాంతి కుమార్

సంగీతం: మోపూరి శేఖర్

నిర్మాత: మందపల్లి సూర్య నారాయణ, కొండమూరి ఫణి, మదినే దుర్గా రావు,  

దర్శకత్వం: బెజగం హర్ష

కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు  సంయుక్తంగా విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కించిన మూవీ ‘SPEED220’.  కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి  యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందు కుచ్చింది. డిఫరెంట్ కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..  

కథ విషయానికొస్తే..

సూర్య(హేమంత్), చందు(గణేష్) ఇద్దరూ మంచి దోస్తులు. ఊళ్లో వాళ్లకి తలలో నాలుకలా అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు.   అదే గ్రామానికి చెందిన భిక్షపతి(తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీందారు ఇంట్లో పనిచేస్తూ... ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయనకు మాయ(భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్) అనే ఓ ఆధునిక  భావాలు కలిగిన యువతి. సూర్య, గణేష్, మాయ ముగ్గురు చిన్నప్పటి నుంచే చదువుకుంటూ పెరుగి పెద్దవారు అవుతారు. అయితే మాయ సూర్య, చందులను ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యంగా మెలుగుతూ ఉంటుంది.  సూర్యకి చింటూ అనే ఓ చిన్న కుర్రాడితో స్నేహంగా ఉంటాడు. ఆ పిల్లాడు అనుకోకుండా  అనుమానాస్పదస్థితిలో కన్నూమూస్తాడు.  అలాగే మాయ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అసలు వీళ్ల మృతి వెనక కారణాలు ఏంటి.. ? తను ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తులు చనిపోవడం వెనక కుట్రను హీరో ఎలా ఛేదించాడు ? ఈ క్రమంలో జరిగిన పరిణామాలే ఈ సినిమా కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
రా లవ్ స్టోరీలకు యువతలో  మంచి క్రేజ్ ఉంది.  గతంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 కానీ, అర్జున్ రెడ్డి కానీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచాయో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి స్టోరీలను పిక్చరైజ్ చేసినపుడు స్క్రీన్ ప్లే కీ రోల్  పోషిస్తుంది. తెలిసిన కథలే అయినా... వాటికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని స్క్రీన్ పై  చూపిస్తే... యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ చెప్పినట్టు ఇది ఓ డిఫరెంట్ జానర్ సినిమా. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి చుట్టూ... స్వచ్ఛమైన ప్రేమకోసం ఓ ఇద్దరు నిజాయతీగల యువకులు తిరిగే కథ. దానిని తెరమీద కొన్ని బోల్డ్ సీన్స్ తోనూ... ‘రా’ రొమాన్స్ ను యూత్ ను అట్రాక్ట్ చేయడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం బాగుంది.  దానికి కారణం... ప్రీతి సుందర్ అంద చందాలే అని చెప్పొచ్చు. ఎక్కడా బోరింగ్  లేకుండా ఇద్దరు యువకులతో ప్రీతి చేసిన ఆన్ స్క్రీన్  రొమాన్స్ తో స్క్రీన్ ను వేడిక్కించాడు దర్శకుడు.  యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో అంతా... లవ్, రొమాన్స్ ను చూపించిన డైరెక్టర్... సెకెండాఫ్ లో మాస్ యాక్షన్ సీన్స్ లో  ఆకట్టుకున్నారు. సినిమా రన్ టైమ్ కూడా ట్రిమ్మింగ్ ఉండటం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మొత్తంగా ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులు హాట్ సినిమా చూసి ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతోంది.

దర్శకుడు హర్ష... ఇలాంటి ‘రా’ హాట్ లవ్ స్టోరీని ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. స్వచ్ఛమైన ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ఓ ఇద్దరు యువకులు, ఓ యువతిల మధ్య జరిగే ట్రయాంగిల్ కథ.. స్క్రీన్ ప్లే ను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు తెరకెక్కించాడు.  ఇప్పటి యువతులు ఎలా ఉంటున్నారో ఈ సినిమాలో చూపించాడు.  అయితే వీరితో కలిసి పెరిగిన అమ్మాయి... పెరిగి పెద్దయిన తరువాత ఎందుకు అలా ఆధునిక భావాలతో సెంటిమెంట్ కు తావులేకుండా పెరగాల్సివచ్చిందో కనీసం తండ్రితోనైనా చెప్పించి వుంటే బాగుండేది. కొన్ని సీన్స్ లో హీరోయిన్ ఎందుకు ఇలా మారిందనే విషయాన్ని చెప్పి ఉంటే బాగుండేది.   రొమాంటిక్ సన్నివేశాలను, హీరోలను, హీరోయిన్లను అందంగా చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

ఇందులో మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది. పాయల్ రాజ్ పుత్ మాదిరే ఈమె కూడా అందాల ప్రదర్శనలో ఎలాంటి మెహమాట పడలేదు. అవసరానికి మించి గ్లామర్ ఒలకబోసింది. ఆమె అందాల కోసం యూత్ ఈ సినిమా చూడొచ్చు.  నార్త్  అమ్మాయే అయినా... తెలుగమ్మాయిలా తెరపై మెప్పించింది.  ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పక్కింటి అమ్మాయిలాగ కనిపిస్తుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. భగ్న ప్రేమికుడిగా మంచి నటనే కనబరిచారు. అలాగే గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి  పల్లెటూరి అమ్మాయి పాత్రలో పర్వాలేదనిపించింది. జమిందారు భిక్షపతిగా, హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన తాటికొండ మహేంద్రనాథ్ యాక్టింగ్ పర్వాలేదు.  మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు మెప్పించారు.

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News