Nimmakooru Mastaru: తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ క్లాప్ తో ప్రారంభమైన ‘నిమ్మకూరు మాస్టారు’ మూవీ..

Nimmakooru Mastaru: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినమాధవపెద్ది సురేష్  చంద్ర మనవడు ‘శ్యామ్ సెల్వన్’ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 16, 2024, 07:39 PM IST
Nimmakooru Mastaru: తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ క్లాప్ తో ప్రారంభమైన ‘నిమ్మకూరు మాస్టారు’ మూవీ..

Nimmakooru Mastaru: రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో తెలుగులో భైరవ ద్వీపం, బృందావనం (రాజేంద్ర ప్రసాద్) వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు ‘శ్యామ్ సెల్వన్’ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘నిమ్మకూరు మాస్టరు’. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సినిమా కు క్లాప్ కొట్టారు.  జె.ఎమ్.సినీ ఫ్యాక్టరీ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్  జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అముదేశ్వర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని పాటలను  ప్రముఖ కవి - గీత రచయిత జొన్నవిత్తుల పాటలు రాస్తున్నారు.

‘నిమ్మకూరు మాస్టరు’ ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అంతేకాదు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర, గీత రచయిత జొన్నవిత్తుల, చిత్ర హీరో శ్యామ్ సెల్వన్, నిర్మాత జె.ఎమ్.ప్రదీప్, దర్శకుడు అముదేశ్వర్ పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను మీడియకు వెల్లడించారు.  

తమ ఫ్యామిలీ నుంచి ఐదో తరం వాడైన తన మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం కావడం గర్వంగా ఉందన్నారు మాధవపెద్ది సురేష్ చంద్ర. ఒక గొప్ప కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. "నిమ్మకూరు మాస్టారు" జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నిమ్మకూరు అనగానే అన్న ఎన్టీఆర్ ఊరు గుర్తుకు వస్తుంది. అదే సమయంలో నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ కూడా నిమ్మకూరుతో అనుబంధం ఉంది.  ఈ చిత్రంలో మ్యూజిక్ కు  చాలా ప్రాధాన్యత ఉందన పేర్కొన్నారు జొన్నవిత్తుల. ఇందులో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రకటించారు. మాధవపెద్ది ఇప్పటివరకు చేసిన సినిమాలు, ఆయన పాటలు అందించిన సినిమాలు మరొక  ఒకెత్తు... మనవడి పరిచయ చిత్రమైన"నిమ్మకూరు మాస్టారు" కు అద్భుతమైన ట్యూన్స్ అందించబోతున్నట్టు  జొన్నవిత్తుల అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండడరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఎంతో ఉద్వేగంగా ఉందని హీరో శ్యామ్ సెల్వన్ అన్నారు. మాధవపెద్ది, జొన్నవిత్తుల, రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండ్స్ తో "నిమ్మకూరు మాస్టారు" వంటి గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని  ప్రొడ్యూసర్ జె.ఎమ్.ప్రదీప్ పేర్కొన్నారు. తమిళంలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రభు - కమల్ హాసన్ లతో ఓ సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తనకు... "నిమ్మకూరు మాస్టారు" వంటి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందటం విశేషం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అందులో భాగంగా రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తున్నామని వివరించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ఎ.డి.కరుణ్, ఆర్ట్: మురళి, ఎడిటర్: ఎ.ఆర్.శివరాజ్, స్టిల్స్: పాండ్యన్,అసిస్టెంట్ డైరెక్టర్: మద్ధులచెరువు దీపక్, సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం; మాధవపెద్ది సురేష్ చంద్ర, నిర్మాత: జె.ఎమ్.ప్రదీప్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అముదేశ్వర్, పబ్లిసిటీ డిజైన్స్ - కృష్ణ ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రమోహన్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కో-డైరెక్టర్స్: జె.సి.రవికుమార్ - దార్ల నాని, అసోసియేట్ డైరెక్టర్: సూర్య రేపాల. 

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News