Padmavyuham lo Chakradhari Movie Review: ‘పద్మవ్యూహంలో చక్రధారి’ మూవీ రివ్యూ..

Padmavyuham lo Chakradhari Movie Review:  అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన సినిమా ‘పద్మవ్యూహంలో చక్రధారి’. పేరుతోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేట్స్ క్రియేట్ అయ్యాయి. ఈ రోజు విడులైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..     

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 08:47 PM IST
Padmavyuham lo Chakradhari Movie Review: ‘పద్మవ్యూహంలో చక్రధారి’ మూవీ రివ్యూ..

రివ్యూ: పద్మవ్యూహంలో చక్రధారి
నటీనటులు: ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.
సినిమాటోగ్రఫీ: జీ. అమర్
ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్
సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య
నిర్మాత:  కే.ఓ.రామరాజు
దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు
విడుదల:21/06/2024

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పద్మవ్యూహంలో చక్రధారి‘. ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా ఇండ్రడ్యూస్ అయిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా రిలీజైంది. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో మంచి బజ్ క్రియేట్  అయింది. యూత్ ఫుల్ ఎంటర్టేనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
 

కథ విషయానికొస్తే..

రాయలసీమలోని ఓ కు గ్రామంలో జరిగే కథ ఇది ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌) నగరంలో ఐటీలో జాబ్ చేస్తుంటాడు. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి దోస్తులు అవుతారు.  ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరెళ్లిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న చక్రీ ఉన్న పళంగా తన జాబ్ కు  లీవ్ పెట్టి విలేజ్‌కి వెళుతాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తాడు. అతని సాయంతో సత్యను కలువాలి అనే ప్లాన్ చేస్తాడు. అదే ఊరులో పద్మ(అషురెడ్డి) పిల్లకు పాఠాలు చెప్పే పంతులమ్మగా పనిచేస్తూ ఉంటుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా తన గతంలో ఊరి వాళ్లలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆ ఊరి వాళ్లంటే ద్వేషం పెంచుకుంటాడు.  అతను తాగుబోతు అవుతాడు. ప్రేమకోసం వచ్చిన చక్రీ సత్యను దక్కించుకున్నాడా లేదా? పద్మ తాగుబోతు అయిన కోటి ఉన్న రిలేషన్ ఏంటి.. ?  అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏమిటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
 
మహా భారతంలో పద్మవ్యూహం అనేది యుద్ద తంత్రాల్లో ఒకటి. దాన్నే చక్రవ్యూహం అని కూడా పిలుస్తారు.  భారతంలో ఆ వ్యూహం అర్జునుడు, ద్రోణా చార్యుడు, భీష్ముడు, శ్రీ కృష్ణుడు వంటి కొంత మంది మాత్రమే తెలుసు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించడమే కానీ.. బయటపడటం తెలియదు. ఆ కాన్సెప్ట్ ఆధారంగా ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే టైటిల్ పెట్టారు. అన్ని తెలిసిన చక్రీ ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని ఎలా బయట పడ్డాడనేదే ఈ సినిమా కథ. సిటీలో మొదలు పెట్టిన కథను పల్లెటూరికి షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్‌లో అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసే విధానం బాగుంది.ముఖ్యంగా కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. గ్రామంలో కన్పించే రెగ్యూలర్ క్యారెక్టర్లను చాలా ఫన్నీగా రాసుకున్నారు. కథలో అతిముఖ్యమైంది ప్రేమ. దాన్ని ఫస్ట్ ఆఫ్ లో చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ పుట్టడం, అది డెవలప్ అవుతున్న సమయంలో హీరోయిన్ ఊరికి రావడంతో హీరో తన విలేజ్‌కు వస్తాడు. తనను కలువడానికి ఎలక్ట్రీషన్ అయిన శ్రీను హెల్ప్ తీసుకోవడం, అలాగే అంటీలతో పులిహోర కలిపే శ్రీను పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి.

ఇక సెకండ్ హాఫ్‌లో కామెడీ పాలు తక్కువ కాకుండా చూసుకున్నాడు.  ఇక హీరో హీరోయిన్లు దొరికిపోయిన తరువాత సత్య వాళ్ల నాన్న తన అల్లుడికి ఉండవలిన లక్షణాలు చెప్పడంతో సినిమాలో మరో ట్విస్ట్ మొదలు అవుతుంది. అందుకోసం బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ దగ్గరకు వెళ్లడం, నిజం తెలుసుకొని ప్రసాద్ మారడం అలాగే ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేమ కథ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.  కిట్టు క్యారెక్టరైజేషన్ కూడా సినిమాకు ప్లస్ అని చెప్పాలి.   మొత్తంగా  సెకండ్ ఆఫ్ కూడా కామెడీ తగ్గకుండా భావోద్వేగాలతో కట్టిపడేశారు. పాటలు కూడా అలరించాయి.

దర్శకుడు బంగారపు సందీప్ రెడ్డి తాను అనుకున్న కథను తెరపై చక్కగా ప్రేక్షకులకు ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు.  అలాగే ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ తెరమీద పేలాయి.  విలేజ్ నెటివిటీకి తగ్గట్టుగా డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ విషయంలో జీ. అమర్ కు మంచి మార్కులే పడుతాయి. అలాగే నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సువ్వి సువ్వి పాట చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో పర్వాలేదు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కాబట్టి పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

నటీనటుల విషయానికొస్తే..

హీరోగా ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ ఫస్ట్ మూవీ అయినా సరే నటన పరంగా మెప్పించాడు. లవ్  సీన్లలో చాలా బాగా నటించాడు. అలాగే సాంగ్స్ మంచి ఈజ్ చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు. కచ్చితంగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి భవిష్యత్తు ఉంది. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ నటన బాగుంది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో తన కళ్లతో, హావభావాలతో అలరించింది. తెలుగు నేటివిటీకి ఫిట్ అయింది.  కచ్చితంగా ఈ సినిమాతో మంచి భవిష్యత్తు ఉంటుందనే హోప్స్ పెట్టుకుంది. ఇక అషురెడ్డి తను గ్లామర్ క్యారెక్టర్ కాకుండా సెటిల్డ్ క్యారెక్టర్ చేసింది. ఒక పిల్లాడి తల్లిలా నటించింది. మురళిధర్ గౌడ్ తన క్యారెక్టర్ మేరకు మెప్పించాడు. అలాగే మహేష్ విట్టా కామెడీ అద్భుతంగా పండించాడు. మధునందన్ నటన బాగుంది.మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం

కామెడీ

నటీనటులు

మైనస్ పాయింట్స్

అక్కడక్కడ కాస్త స్లో అనిపిస్తుంది.

ఎడిటింగ్

రేటింగ్: 2.75/5

Also Read: Pawan Kalyan: పవన్ పేషీలో పవర్ ఫుల్ ఐఏఎస్.. కేంద్రానికి స్పెషల్ గా లేఖ.. ఎందుకో తెలుసా.? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News