CM Revanth Reddy: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి హావా.. సంచలన ప్రెస్ మీట్.. ఏమన్నారంటే..?

Maharashtra Elections: సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతే కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను గురించి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 9, 2024, 01:36 PM IST
  • మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్..
  • మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఫైర్..
CM Revanth Reddy: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి హావా.. సంచలన ప్రెస్ మీట్.. ఏమన్నారంటే..?

Telangana cm revanth reddy pressmet in Maharashtra: సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తన జన్మదిన వేడుకలు, మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో బిజీగా గడిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. బీఆర్ఎస్ నేతలు ఎంతగా అడ్డంపడిన మూసీ నదీ సుందరీ కరణ చేసుడే అంటూ.. తెల్చి చెప్పారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకు వెళ్లారు. ముంబైలో కాంగ్రెస్ నేతలను కలిశారు. అక్కడ ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో చర్చించుకున్నట్లు తెలుస్తొంది.

 

ఈ క్రమంలో..  సీఎం రేవంత్ మహా కాంగ్రెస్ నేతలతో ముంబైలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను గురించి వివరించారు. అదే విధంగా మహారాష్ట్రలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పై చేస్తున్న ఆరోపణల్ని రేవంత్ తిప్పికొట్టినట్లు తెలుస్తొంది. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో  కాంగ్రెస్ అధికారాంలోకి వస్తే.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు.

ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. అదే విధంగా.. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని, ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే  50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. మహాలక్ష్మీ పథకం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని,  అదే విధంగా.. రూ.500లకే గ్యాస్ సిలీండర్ అందిస్తున్నని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల  ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నట్లు తెలిపారు.

వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామని, ఎంఎస్ పీ కూడా అందిస్తున్నామని రేవంత్ చెప్పారు. దీనితో.. 1 కోటి 4 లక్షల మంది మహిళలు  ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నరని తెలిపారు. దీని కోసంగాను.. రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించిందని, సామాజిక న్యాయం అందించేందుకు  తెలంగాణలో కులగణన చేపట్టినట్లు తెలిపారు.

మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామని బీజేపీకి రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. అందుకే తాను.. మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని రేవంత్ అన్నారు.

దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని ఫైర్ అయ్యారు.

Read more: KTR Vs Revanth Reddy: గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్‌ మినిస్టర్ రేవంత్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్

దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారని జాతీయ నేతల్ని రేవంత్ స్మరించుకున్నారు. అంతే కాకుండా.. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరలించుకొని పోయారని ఎద్దేవా చేశారు. మహా ప్రజల్ని.. మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండని తెలంగాణ సీఎం రేవంత్ పిలుపునిచ్చినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News