Carrot Juice For Constipation Weight Loss: భారత దేశంలో రోజురోజుకు చలి తీవ్రత రెట్టింపుగా అవుతోంది. దీని కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే వాతావరణం లో తేమ పెరగడం వల్ల తీవ్రవ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని డిహైడ్రేషన్కు గురికాకుండా చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా మీరు తీసుకునే పానీయాలలో కూడా పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం సులభంగా లభిస్తుంది. అయితే చలికాలంలో ఎలాంటి పానీయాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
క్యారెట్ జ్యూస్:
క్యారెట్ లో శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి క్యారెట్లు శీతాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి క్యారెట్ జ్యూస్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శీతాకాలంలో వచ్చే పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తరచుగా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
శీతాకాలంలో మలబద్ధకం సమస్యలు ఎందుకు వస్తాయి?
చలిలో ఉష్ణోగ్రత శాతం పూర్తిగా పడిపోతుంది. దీని కారణంగా మన శరీరంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతల స్థాయిలో జీర్ణ క్రియపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా తీర్ణక్రియలో మార్పులు సంభవించి మలబద్ధకం, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
క్యారెట్ రసంలో విటమిన్ ఎ, సి, డి, కె మొదలైన అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలాచ రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీర బరువును నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది:
మలబద్ధకంతో బాధపడుతున్న వారికి క్యారెట్ జ్యూస్ ప్రభావంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను శక్తి వతంగా చేసి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి పొట్ట సమస్యలు, బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఈ జ్యాస్‌ను తాగాల్సి ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త
Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook