Weight Loss Tips: ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే 3 రకాల పదార్ధాల్ని దూరంగా ఉంచాల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ముఖ్యమైంది స్థూలకాయం. శరీరం బరువు పెరగడం. ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసో తెలియకో కొన్ని పదార్ధాలు తినడం వల్ల అధిక బరువు సమస్య మరింతగా పెరుగుతుంటుంది. స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు ఏ పదార్ధాల్ని దూరంగా పెట్టాలో తెలుసుకుందాం..
మైదాలో ఉండే పోషకాల్లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. మైదాతో చేసిన పదార్ధాల్ని రోజూ తీసుకుంటే వర్కవుట్స్ ఎక్కవగా చేయాల్సి వస్తుంది. లేకపోతే స్థూలకాయానికి గురవుతారు. అందుకే మైదాతో చేసే పదార్ధాల్ని తక్షణం దూరం పెట్టాలి.
బరువు తగ్గాలనుకుంటే పంచదారను దూరంగా పెట్టాలి. పంచదారలో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఈ ఫ్యాట్ మొత్తం డైట్ సిస్టమ్‌ను పాడు చేస్తుంది. పంచదార కలిపిన పదార్ధాల్ని తీసుకోకూడదు.
ఫ్రైడ్ పదార్ధాల్ని డైట్ నుంచి తొలగించాలి. కొంతమంది ఫ్రైడ్ పదార్ధాల్ని లేదా జంక్ ఫుడ్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. అధిక బరువుకు ఇవే ప్రధాన కారణాలు. అందుకే ఫ్రైడ్ పదార్ధాల్ని పూర్తిగా దూరం చేయాలి.
Also read: Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన సీడ్స్ ఇవే, పోషక పదార్ధాలు ఫుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook