Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే

Valentine History: ప్రపంచ ప్రేమికులు అత్యంత ఘనంగా జరుపుకునే రోజు వాలెంటైన్ డే. వాలెంటైన్ డేకు ఓ చరిత్ర ఉంది, ఓ నేపధ్యముంది. అందరూ ఊహించినట్టుగా ప్రేమికుడి త్యాగం లేదు. ఆశ్యర్యంగా ఉందా..ఆ కధేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2023, 02:57 PM IST
Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే

వాలెంటైన్ డే అనేది ప్రేమికుల దినోత్సవంగా అందరికీ సుపరిచితమైంది. ఇది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే జరుపుకునే రోజు కాదు. అదే సమయంలో ఓ ప్రేమికుడి త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునేది అంతకంటే కాదు. వాలెంటైన్స్ డే విశేషం, చరిత్ర, సందర్భం తెలుసుకుంటే మీకే తెలుస్తుంది..

వాలెంటైన్ డే నేపధ్యం ఇదీ

క్రీస్తుశకం 270 నాటి ఘటన నేపధ్యంగా ప్రారంభమైంది వాలెండైన్స్ డే. నాటి రోమ్ సామ్రాజ్యం ఇందుకు వేదికగా నిలిచింది. నాటి రోమ్ చక్రవర్తి క్లాడియస్‌కు పెళ్లంటే అస్సలు పడదు. పెళ్లిళ్లపై నిషేధం కూడా విధించాడు. అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మతగురువు..అక్కడి ప్రజలకు ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవాడు. అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే లవ్‌గురు. ప్రేమ సిద్ధాంతాన్ని బోధించడమే కాకుండా ప్రేమ పెళ్లిళ్లు కూడా చేయించేవాడు. పెళ్లిళ్లపై ద్వేషంతో నిషేధం విధించినా ప్రేమ పెళ్లిళ్లు పెరగడంతో క్లాడియస్‌కు కోపమొచ్చింది. ఆరా తీస్తా ఈ లవ్‌గురు వాలెంటైన్ వ్యవహారం తెలిసింది. అంతే ఆగ్రహంతో రాజద్రోహం ఆరోపణలతో మరణశిక్ష విధిస్తాడు. జైళ్లో ఉండగా..జైలు అధికారి కూతురితో ప్రేమలో పడతాడు వాలెంటైన్. ఫిబ్రవరి 14న చనిపోయేంతవరకూ ప్రియురాలి గురించి తల్చుకుంటూ..యువర్ వాలెంటైన్ అంటూ లేఖ రాస్తాడు. అదే వాలెంటైన్ డేగా మారింది.

ఇండియాలో ఎందుకు వ్యతిరేకత

1990 దశకం నుంచి వాలెంటైన్ డే పట్ల ఇండియాలో వ్యతిరేకత ఎక్కువైంది. ఇది భారత దేశ సంస్కృతి కాదనేది విశ్వ హిందూపరిషత్, శివసేన, భజరంగ్ దళ్ వంటి సంస్థల వాదన. ప్రతి ఏటా వాలెంటైన్ డే నాడు రంగంలో దిగడం, ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. వాలెంటైన్ డే అంటే ప్రేమికుడి త్యాగం కాదనే విషయం చాలామందికి తెలియక..వ్యతిరేకిస్తుంటారు. పెళ్లిళ్లంటే పడని ఓ రాజు ఆదేశాల్ని ధిక్కరించిన నేరానికి వాలెంటైన్ అనే వ్యక్తికి ఉరిశిక్ష పడిందనే వాస్తవం చాలామందికి తెలియదు. 

Also read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News