Fiber Rich Fruits For Better Digestion: ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు కూడా ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరగాయలు, పండ్లు కడుపు ఆరోగ్యంతోపాటు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే అలాంటి నాలుగు రకాల పండ్లు తెలుసుకుందాం.
అవకాడో..
ఈ బట్టర్ ఫ్రూట్‌లో విటమిన్ సీ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది ఫైబర్ పుష్కలంగా తీసుకోవాలని ప్రయత్నించేవారు చేర్చుకోవాలి.
కీవీ..
కీవీలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక్కో కీవీ పండులో రెండు గ్రాములకు పైగా ఫైబర్ ఉంటుంది. అంతేకాదు కీవీ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఫైబర్ ఉంటుంది. కీవీ తొక్కలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 50 శాతం పైగా ఫైబర్ ఉంటుంది. ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
యాపిల్..
ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలి అంటారు. ఇందులో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు సమస్యలు ఉన్నవారు యాపిల్ తినాలి. అంతేకాదు ఈ పండు తొక్కలో కూడా ఫైబర్ అధికమోతాదులో ఉంటుంది. యాపిల్‌లో కూడా కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇదీ చదవండి: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్..!
రాస్బెర్రీ..
రాస్బెర్రీ బెర్రీ జాతికి చెందిన పండు. ఇందులో పోషకాలు మెండు. అంతేకాదు రాస్బెర్రీ పండులో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. రాస్బెర్రీ పండులో కరగని ఫైబర్ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి కాకుండా జామ పండులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక్క మీడియం సైజు జామ పండులో ఐదు గ్రాములకు పైగా ఫైబర్ ఉంటుంది. ఇందులో కూడా కరగని ఫైబర్ ఉంటుంది.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు ఉంది తెలుసుకోండి..
ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా బెర్రీ జాతి పండ్లు, అరటిపండు, జామ వీటిని కలిపి తీసుకోవడం వల్ల రోజంతా మన కడుపు ఆరోగ్యం బాగుంటుంది. వీటిని యోగార్ట్ లేదా స్మూథీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది సమతుల ఆహారం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పండ్లను తమ డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇవి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ కూడా అందిస్తాయి. ఇవి రోజంతటికీ కావాల్సిన శక్తి కూడా అందిస్తాయి. ఎంతో ఆరోగ్యం కూడా ఉదయం అనారోగ్యానికి దారితీసే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.