Hair Tips: కెమికల్ రంగులు కాదు ఈ ప్రొటీన్ హెయిర్ మాస్క్ అప్లై చేయండి...

Protein Hair Mask: ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.  

Last Updated : Dec 19, 2020, 09:11 AM IST
    1. ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం.
    2. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.
Hair Tips: కెమికల్ రంగులు కాదు ఈ ప్రొటీన్ హెయిర్ మాస్క్ అప్లై చేయండి...

Hair Colouring Tips : మారుతున్న కాలాన్ని బట్టి కొత్త కొత్త ఫ్యాషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మహిళలు నిత్యం కొత్త కొత్త ఫ్యాషన్స్‌ను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. చాలా మంది మహిళలు డిఫరెంట్ లుక్‌కోసం ప్రయత్నించి తమ జుట్టుకు రంగేయడం మొదలుపెడతారు. కలర్‌లో ఉన్న ఒక చెడ్డ విషయం ఏంటంటే..మొదట్లో ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తరువాత ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంది.

Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!

రంగు వెలిసిపోవడం ప్రారంభం అయినప్పుడు దాని వల్ల జుట్టు (Hair) కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.

ప్రొటీన్ హెయిర్ మాస్క్ కోసం కావాల్సినవి

-అవిసెల పిండి ( Flax seeds)- 2 చెంచాలు

-కొబ్బరి నూనె- రెండు చెంచాలు

-ఫుల్ క్రీమ్ మిల్క్-1కప్పు

-గుడ్డులో తెల్ల సొనా-1 చెంచా

-మోయోనిజ్-3 చెంచాలు

Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!
ప్రొటీన్ హెయిర్ మాస్క్ చేయాల్సిన విధానం
1.ముందుగా అవిసెలను ఉడికించి దాని నుంచి వచ్చే జెల్‌ను వేరు చేయండి. 

2. ఒక చిన్న గిన్నెలో గుడ్డులోని (Egg) పచ్చ సొనాను వేయండి.

3. ఇందులో అవిసె జెల్‌తో పాటు ఇతర పదార్థాలు కూడా వేయండి.

4.మీ ప్రొటీన్ హెయిర్ మాస్క్ సిద్ధం అయింది. 

5.దీన్ని మీ జుట్టుపై అప్లై చేయండి. 
6. తరువాత  30 లేదా 60 నిమిషాల తరువాత కడిగేయండి.

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News