Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: పిస్తా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు ఉంటాయి. కానీ వీటిని కొన్ని వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2024, 01:33 PM IST
Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తుంది. పిస్తా పప్పులు డ్రై ఫ్రూట్స్ లో ప్రస్థిది చెందిన ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌. వీటిని ఎక్కువగా సలాడ్స్, స్వీట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పిస్తాలో  పొటాషియం, క్యాల్షియం, ఐరన్ , విటమిన్ b6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఆరోగ్యని పనుల ప్రకారం ఈ పిస్తా పప్పును కొంతమంది  వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు అని చెప్తున్నారు. 

పిస్తా పప్పును ఎవరు తినకూడదు:

అలర్జీ  రోగులు:

పిస్తా పప్పు తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత్తులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అలర్జీతో బాధపడుతున్నవారు ఈ పిస్తా పప్పుకు దూరంగా ఉండాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. అలర్జీ సమస్యతో బాధపడేవారు పిస్తా పప్పును తీసుకొనే మందు వైద్యుడిని సంప్రదించండి. 

కిడ్నీ సమస్యలు:

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పిస్తా పప్పును తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల  కిడ్నీలో రాళ్ల సమస్యలను కలిగిస్తుంది.

అధిక బరువు సమస్య:

అధిక బరువు సమస్య ఉన్నవారు పిస్తా పప్పు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్పిస్తాలో ఎక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరుగుతారని చెబుతున్నారు.బరువు తగ్గాలి అనుకునేవారు డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పక్కన తీసుకోకపోవడం ఉత్తమం.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పును తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల అజీర్ణం, గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. 
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో వేడి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తక్కువ వయసు ఉన్న పిల్లలు

చిన్నపిల్లలకు పిస్తా పప్పు ఇవ్వడం మంచిది కాదు. పిస్తా పప్పు వారి గొంతుకు అడ్డుపడుంది. దీని వల్ల శ్వాస సమస్యలు కలుగుతాయి. కాబట్టి చిన్నపిల్లలకు ఇవ్వడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

పిస్తా పప్పు తీసుకొనే మందు మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. పిస్తా తీసుకోవడం వల్ల ఆరోగ్యలాభాలు ఉన్నప్పటికి ఈ పైన చెప్పిన వారు ఈ పప్పు తీసుకొనే మందు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా మంచిది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News