stress management foods: నేటి కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య ఒత్తిడి. శరీరంలో అడ్రినాలిన్, కార్టిసోల్ హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల ఈ ఒత్తిడి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకునే చిట్కాలు తెలుసుకుందాం.
కొన్ని రకాల ఆహారం పదార్థాలను తీసుకోవటం వల్ల ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.
ఆరెంజ్ పండు: ఆరెంజ్ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధిక రక్తపోటును నియంత్రిచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కార్టిసోల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
పాలు: ప్రతిరోజు రాత్రి పడుకోనే ముందు గ్లాస్ పాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో బి2, బి12 విటమిన్లు, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు.
బాదం: డ్రై ఫ్రూట్స్ లో అధిక పోషకాలు ఉంటాయి. అందులో బాదం ఒకటి. శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఒత్తిడి కారణమయ్యే సమస్య నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఫిష్: ఫిస్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
Also read: Carrots For Diabetics: మధుమేహం ఉన్నవారు క్యారెట్లను తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి