/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Rosemary for Glowing skin: రోజ్మెరీలో మంచి అరోమెటిక్ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టు, చర్మానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. రోజ్మెరీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. ఇవి క్రిమీ కీటకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. మీ ముఖంపై సున్నితంగా రోజ్మెరీ ఆయిల్‌తో మసాజ్ చేస్తే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మన చర్మంపై పేరుకున్న నల్ల మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. 

రోజ్మెరీ ఆయిల్..
రోజ్మెరీ ఆయిల్ ను సులభంగా మన బ్యూటీ రొటీన్లో చేర్చుకోవచ్చు. దీన్ని ముఖంపై నేరుగా మసాజ్ చేయవచ్చు. ఇది మన చర్మానికి మాయిశ్చర్ నిలుపుతుంది. ఇందులో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ముఖంపై సర్క్యూలర్‌ మోషన్లో రుద్దడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది మన స్కిన్ ను పొడిబారకుండా చేస్తుంది. దీంతో ఈవెన్ టోన్ తోపాటు మెరిసే చర్మం మీ సొంతం.

రోజ్మెరీ, యోగర్ట్‌ ఫేస్‌మాస్క్..
యోగర్ట్‌, రోజ్మెరీతో మంచి ఫేస్‌ మాస్క్ తయారవుతుంది. రోజ్మెరీని కాస్త నలిపి యోగర్ట్‌ లో వేసుకుని పేస్ట్‌ మాదిరి చేసుకోవాలి. ఈ మాస్క్‌ను ముఖం, మెడ భాగంలో అప్లై చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత ఫేస్‌ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది.

రోజ్మెరీ టోనర్..
రోజ్మెరీ టోనర్ కూడా వీటి ఆకులతో తయారు చేసుకోవచ్చు.  దీనికి కొన్ని రోజ్మెరీ ఆకులను తీసుకోవాలి ఆ తర్వాత రోజ్‌ వాటర్‌లో రోజ్మెరీ ఆకులను  నలిపి వేసుకోవాలి. ఇప్పుడు టోనర్ తయారవుతుంది. ఇప్పుడు ఓ కాటన్ ప్యాడ్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి. దీన్ని ఓ బాటిల్‌ లో వేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు.

రోజ్మెరీ బాత్..
రోజ్మెరీ స్నానం చేసే సమయంలో కూడా ఉపయోగించవచ్చు.  గుప్పెడు రోజ్మెరీ ఆకులను తీసుకుని అందులో మనం స్నానం చేసిన నీటిలో వేసుకోవాలి. దీని నుంచి మంచి అరోమా కూడా వస్తుంది. దీంతో మీ శరీరానికి పునరుజ్జీవనం కూడా వస్తుంది.

ఇదీ చదవండి: మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ మ్యాజికల్ మాస్క్ అప్లై చేయండి..

రోజ్మెరీ ఫెషియల్ స్టీమ్..
రోజ్మెరీ ఆకులతో తరచూ ఫేషియల్ స్టీమ్ తీసుకోవడం వల్ల కూడా మీ చర్మం మెరిసిపోతుంది. దీనివల్ల మీ ముఖం మెరిసిపోతుంది. ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో తాజా రోజ్మెరీ ఆకులను వేయాలి. ఆ నీటిని మెల్లిగా స్టీమ్‌ చేసుకోవాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

ఇదీ చదవండి: ఉల్లిపాయ రసం ఇలా వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..

రోజ్మెరీ ఐస్‌క్యూబ్స్..
గ్రీన్ టీ తయారు చేసుకోవాలి. అందులో రోజ్మెరీ ఆకులను కూడా వేయాలి. ఆ తర్వాత ఈ నీటిని  ఫ్రీజర్ ఐస్ బాక్స్ లో వేసుకొని ఐస్‌ క్యూబ్స్ తయారుచేయాలి. ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ, ఐస్ క్యూబ్స్ ముఖానికి అప్లై చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Rosemary for Glowing skin with yogurt rosemary face mask and toner rn
News Source: 
Home Title: 

Rosemary for Glowing skin: రోజ్మెరీతో మృదువైన, మెరిసే ముఖం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..
 

Rosemary for Glowing skin: రోజ్మెరీతో మృదువైన, మెరిసే ముఖం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..
Caption: 
Rosemary for Glowing skin
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రోజ్మెరీతో మృదువైన, మెరిసే ముఖం మీ సొంతం..
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Tuesday, May 14, 2024 - 15:02
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
9
Is Breaking News: 
No
Word Count: 
326