Post Office Jobs: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో శాశ్వత, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 68 కొలువులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధులు జనవరి 10 వరకూ అప్లై చేసుకోవచ్చు. అధిక జీతాలు లభించే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులివి. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశంలోని వివిధ పోస్టాఫీసుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ పోస్టులు రెండూ ఈ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ కానున్నాయి. ఇందులో స్కేల్ 1,2,3 గ్రేడ్లు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్ధులు నిన్న అంటే డిసెంబర్ 21 నుంచి 2025 జనవరి 10 వరకూ ఆన్లైన్లో www.ippbonline.com ద్వారా దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 21 ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జనవరి 10 రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.
ఏయే పోస్టుల భర్తీ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ ఐడీ 54 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మేనేజర్ ఐటీ 1, మేనేజర్ ఐటీ నెట్వర్క్ అండ్ క్లౌడ్ విభాగంలో 2, మేనేజర్ ఐటీ ఎంటర్ప్రైజ్ డేటా వేర్‌హౌస్ విభాగంలో 1, సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ విభాగంలో 1, సీనియర్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ అండ్ క్లౌడ్ విభాగంలో 1, సీనియర్ మేనేజర్ ఐటీ కాంట్రాక్ట్ మేనేజ్నెంట్ 1, సైబర్ సెక్యూరిటీ 7 పోస్టులు కాంట్రాక్ట్ విభాగంలో భర్తీ కానున్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వయస్సు డిసెంబర్ 1 నాటికి 20-30 ఏళ్లలోపుండాలి. మేనేజర్ పోస్టులకు 23-35 ఏళ్లుండి 3 ఏళ్ల అనుభవముండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు 26 నుంచి 35 ఏళ్లుండాలి. ఆరేళ్లు ఎక్స్పీరియన్స్ అవసరం. జనరల్ అభ్యర్ధులు ఫీజు 750 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు 150 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక విద్యార్ఙత అనేది పోస్టుల్ని బట్టి బీఈ లేదా బీటెక్ డిగ్రీ సంబంధిత విభాగంలో ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో పీజీ ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్ధులు www.ippbonline.com ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత ఈ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయి అప్లికేషన్ ఫిల్ చేసి ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. చివరిగా అన్ని వివరాలు వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి. ఇంటర్యూ సమయంలో సమర్పించాల్సిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్లు వెబ్సైట్లో ఉంచాలి.
Also read: School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.