Meena marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తగ్గించుకున్న మీనా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఉన్నత అంచులు చూసిన ఈమె వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మీనా చిరంజీవిని మొదలుకొని చాలామంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయం అందుకుంది.. తన అందంతో, నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
1976లో చెన్నైలో జన్మించిన మీనా ఆరేళ్ల వయసులో సినిమాలలో నటించడం ప్రారంభించింది. 1982లో ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ నటించిన చిత్రం ద్వారా బాలనటిగా అడుగుపెట్టిన ఈమె.. బాల నటిగా దాదాపు 15కుపైగా చిత్రాలలో నటించింది. ఇక ఆ తర్వాత 40 యేళ్ళ పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా నిలిచిన ఈమె.. 2009లో విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది.
కానీ 2022లో విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందడంతో యావత్ సినీ పరిశ్రమ అలాగే ఆమె అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒక వేదికపై మాట్లాడుతూ.. ఈ వయసులో మీనా భర్తను కోల్పోవడం చాలా బాధగా ఉంది" అంటూ తెలిపారు.
అయితే మీనా తన భర్తను కోల్పోయిన తర్వాత చాలామంది రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ చేశారు. ఈ వివాదంలో నటుడు ధనుష్ తో సహా పలువురు ప్రముఖ నటుల పేర్లు కూడా బయటకు రావడం గమనార్హం. అయితే మీనా మాత్రం చాలాసార్లు తన కూతురే తన ప్రపంచం అని చెప్పినా సరే ఎవరు కూడా ఈ పుకార్లను ఆపడం లేదు.
ఇదిలా ఉండగా ఒక ప్రముఖ నటుడు.. మీనాకు బిడ్డ ఉన్నా పర్లేదు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు సంతోష్ వర్గీస్. గతంలో మోహన్ లాల్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తలు నిలిచిన ఈయన ఇదివరకే చాలామంది నటీమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి నెటిజన్ల దృష్టిలో పడ్డాడు.
ఇకపోతే కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో పెళ్లి గురించి అనుచితంగా మాట్లాడిన ఈయన.. ఇప్పుడు మీనా గురించి మాట్లాడి సంచలనం సృష్టించాడు. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు స్టార్ సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు.