Morning weight loss drinks: ఈ 5 మార్నింగ్ డ్రింక్స్‌ తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫై చేయడమేకాదు, బరువు కూడా తగ్గించేస్తుంది..

Morning weight loss drinks: బరువు తగ్గడం అనేది అంత ఈజీ ప్రక్రియ కాదు. దీనికి ఎన్నో రోజులు పడుతుంది. మంచి డైట్ పాటించాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అది బిజీ లైఫ్ లో అవన్నీ చేయడం అసాధ్యం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 1, 2024, 08:16 PM IST
Morning weight loss drinks: ఈ 5 మార్నింగ్ డ్రింక్స్‌ తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫై చేయడమేకాదు, బరువు కూడా తగ్గించేస్తుంది..

Morning weight loss drinks: బరువు తగ్గడం అనేది అంత ఈజీ ప్రక్రియ కాదు. దీనికి ఎన్నో రోజులు పడుతుంది. మంచి డైట్ పాటించాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అది బిజీ లైఫ్ లో అవన్నీ చేయడం అసాధ్యం. అయితే వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు ఉదయం పూట కొన్ని జ్యూసులు తీసుకోవడం వల్ల డిటాక్సిఫై అవ్వడమే కాకుండా కొవ్వు కూడా కరిగించేస్తుంది. ఫైబర్ ,విటమిన్స్ ,మినరల్స్ పుష్కలంగా ఉండే జ్యూసులు ఏవో తెలుసుకుందాం.

పండ్ల రసాల్లో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించడమే కాకుండా బరువును కూడా సులభంగా తగ్గిస్తాయి.

కొత్తిమీర జ్యూస్..
ఉదయం ఖాళీ కడుపున పరగడుపున కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే కొత్తిమీరలో న్యాచురల్ డైరోటిక్ ఉంటుంది. ఇది శరీరంలో అతిగా ఉన్న నీటిని బయటికి పంపించేస్తది. కాలేయ ఆరోగ్యానికి తోడ్పడి ఇన్సూలిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది.

నిమ్మరసం..
ఖాళీ కడుపున నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇది నిమ్మరసం రోజంతటి కావాల్సిన శక్తిని ఇస్తుంది మెటబాలిజం రేటును పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం ఖాళీ కడుపున నిమ్మరసం తీసుకోవాలి.

ఇదీ చదవండి: మీరు 24 గంటలు ఏసీ నడుపుతున్నారా? పేలుతుంది ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఉసిరి రసం..
ఉసిరి రసం కూడా మెటబాలిజం రేటును పెంచి జీర్ణ ఆరోగ్యానికి బూస్టింగ్ ఇస్తుంది. ఉసిరి రసం మన డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. ఒక కప్పు ఉసిరి రసంలో కాస్త తేనె వేసుకొని తీసుకుంటే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కాకరకాయ జ్యూస్..
కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది కానీ బరువు సులభంగా తగ్గిస్తుంది.ఇందులో ఫ్యాట్ బర్నింగ్ గుణాలు ఉన్నాయి. దీంతో బరువు ఈజీగా తగ్గిపోతారు. రెగ్యులర్గా కాకరకాయ జ్యూస్ డైట్లో చేర్చుకోవడం వల్ల కాకరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గుతారు.

ఇదీ చదవండి: ఈ ఫ్రూట్‌ ఫెషియల్ ఇంట్లో చేసుకుంటే మీ ముఖానికి రెట్టింపు గ్లో..

కీరదోసకాయ రసం..
కుకుంబర్ జ్యూస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి పరగడుపున కుకుంబర్ జ్యూస్ తాగడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇది డిటాక్స్ ఫై చేసి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News