Longer Life: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా కొంతమందిలో శరీరంలోని రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారు ప్రస్తుత కాలంలో శరీరం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే వాతావరణ కాలుష్యం, జీవనశైలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి పైకి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. కానీ శరీరంలోని అనేక రకాల వ్యాధులను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ కాలం జీవించడానికి ప్రతి సంవత్సరం కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని వారంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా 10 పరీక్షలను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మీకు ఏ వ్యాధి లేకపోయినా ఈ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి:
ప్రస్తుతం చాలామంది ఆధునిక జీవనశైలి కారణంగా 30 ఏళ్ల లోపే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమందిలో శరీరంలో ఎలాంటి వ్యాధులని తెలియకుండా మరణిస్తున్నారు. ఇప్పుడున్న సమయాల్లో దీర్ఘకాలం పాటు జీవించడానికి తప్పకుండా 30 ఏళ్లు పైబడిన వారు 10 రకాల పరీక్షలు చేయించుకోవడం, శరీరం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొంతమందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ పది రకాల పరీక్షలు చేయించుకోవడం వల్ల మీకు వస్తున్న అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహం కాలేయ సమస్యలు మూత్రపిండాల సమస్యలు వచ్చేముందే ఈ పరీక్షలతో సులభంగా పసిగట్టవచ్చని వారంటున్నారు. అయితే 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు ఈ క్రింది పరీక్షలను ప్రతి ఏడాది చేయించుకోవాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ పరీక్షలు చేయించుకోండి:
పూర్తి రక్తం నమూనాల పరీక్ష (CBC)
లివర్ ఫంక్షన్ టెస్ట్(LFT)
బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్
అధిక రక్తపోటు పరీక్ష
లిపిడ్ ప్రొఫైల్
థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్
విటమిన్ డి టెస్ట్
విటమిన్ B12 టెస్ట్
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter