Pomegranate Facts Nutrition: దానిమ్మ పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీని జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాల లభిస్తాయి.
దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాం. ఈ పండులో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ జబుల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా ఈ పండు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్స్ ను పెంచుతుంది.
దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల రక్తకణాలు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్యను అదుపు చేస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ పండ్లు మనకు సహాయపడతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
దానిమ్మపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పండులో ఉండే అధిక ఫ్లేవనోల్స్ మృదులాస్థి దెబ్బతికుండా, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కలిగే మంటల నుంచి సహాయపడతాయి.
Also Read Ayurvedic Herbs: ఈ ఆయుర్వేద మూలికలు తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు!
దానిమ్మ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లపై దానిమ్మ పండు ప్రభావితంగా పని చేస్తుందని పరిశోధనలో తేలింది.
ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి అనేక సమస్యల నుంచి దానిమ్మ బాధ్యత వహిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read Asthma health tips: ఆస్తమా సమస్యకు చెక్ పెట్టండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter