/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

coriander storing tips: ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగానే కూరగాయలు బయటి వాతావరణంలో పెడితే పాడవుతాయి. మరి ఈ భానుడి భగభగకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ కూరలు చేసుకున్నా అందులో కొత్తిమీర వేసుకోవడం సహజం. అయితే, కొత్తిమీర తీసుకువచ్చిన మొదటి రోజే పాడవుతుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే కొత్తిమీరను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వీటికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొత్తిమీర ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా కొత్తిమీర ను తీసుకువచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. మార్కెట్‌ నుంచి తీసుకువచ్చిన వెంటనే ఈ పనిచేయాలి.

కొత్తిమీరాను ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసుకోవాలంటే ముందుగా వాటి కాడలను కట్‌ చేయాలి. ఆ తర్వాత గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు కొత్తిమీర నీటి తడి లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇదీ చదవండి: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్‌ చేసినట్లు మెరిసిపోతుంది..

కొత్తిమీరను నిల్వ చేసుకోవాలంటే ఓ పాలిథిన్‌ కవర్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనికి కొత్తిమీరను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి. వాటిని ఓ శుభ్రమైన పాలిథిన్‌ కవర్లో నిల్వ చేసుకోవాలి. కొత్తిమీరను, పుదీనాను కూడా ఈ విధంగానే నిల్వ చేసుకోవచ్చు.

కొత్తిమీరాను మార్కెట్‌ నుంచి తీసుకువచ్చి నిల్వ చేసుకునేటప్పుడు ఎక్కువ చలి ఉండే ప్రదేశంలో పెట్టకూడదు. వీటిని కాస్త దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే కూరగాయల బుట్టలో మాత్రమే కొత్తిమీరను నిల్వ చేసుకోవాలి. మరింత చల్లిన ప్రదేశంలో డీప్‌ ఫ్రిజ్‌ కు దగ్గర్లో పెడితే మాత్రం కొత్తిమీర పాడవుతుంది.

కొత్తిమీర ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండాలంటే కొన్ని ఫ్రిజ్‌ బ్యాగులు కూడా ఉంటాయి. వీటిలో కూడా కొత్తిమీరను నిల్వ చేసుకోవచ్చు. కొత్తిమీరను కట్‌ చేసి తడిలేకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. మీరు ఏదైనా పాలిథిన్ బ్యాగులో కొత్తిమీరను నిల్వ చేయాలనుకుంటే ఎక్కువ సమయం లేకుంటే కొత్తిమీరను కాడలతో పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ ఆహారాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే పెట్టాలి.. ఎందుకో తెలుసా?

మీకు కావాలంటే కొత్తిమీరను ఓ స్టీలు డబ్బాలో కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనికి డబ్బా అడుగు భాగంలో ఒక టిష్యూ పేపర్ వేసి కొత్తిమీరను తడిలేకుండా బాగా శుభ్రం చేసి కాడలను కట్‌ చేసి కేవలం కొత్తిమీరను మాత్రమే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
how to store coriander for a long time in fridge here is the tips rn
News Source: 
Home Title: 

coriander storing tips: కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..
 

coriander storing tips: కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..
Caption: 
coriander storing tips
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Sunday, April 28, 2024 - 19:42
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
11
Is Breaking News: 
No
Word Count: 
321