Herbal Tea For Weight Loss: ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే బెడ్ కాఫీతో మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు రోజులో కనీసం 5 నుంచి 6 కాఫీలు తాగుతూ ఉంటారు. కాఫీలు ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నా.. అతిగా తీసుకోవడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటికి బదులుగా ప్రతిరోజు హెర్బల్ టీలు తాగడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్లంతో తయారుచేసిన హెర్బల్ టీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి దీంతో పాటు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుచుతాయి.
అల్లం టీలో ఉండే పోషక గుణాలు:
విటమిన్ సి
మాంగనీస్
జింక్
రాగి
కాల్షియం
ఇనుము
అల్లం హెర్బల్ టీని తాగడం వల్ల కలిగే లాభాలు:
శరీర బరువును నియంత్రిస్తుంది:
ప్రతిరోజు అల్లంతో తయారుచేసిన హెర్బల్ టీని తాగితే శరీరానికి తగిన మోతాదులో పోషకాను లభించి.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఆహారాలు తీసుకున్న తర్వాత అల్లంతో తయారు చేసిన హెర్బల్ టీని తాగాల్సి ఉంటుంది.
పొట్ట సంబంధిత సమస్యలకు చెక్:
అల్లం హెర్బల్ టీలో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సంబంధిత సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ హెర్బల్ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
అల్లంలో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. కాబట్టి సీజన్ మారడం కారణంగా ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా అల్లంతో తయారుచేసిన హెర్బల్ టీ తాగాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇందులో ఉండే గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లను కూడా సులభంగా తగ్గిస్తాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter