Hair Fall Reasons: జుట్టు రాలే సమస్యకు 5 ప్రధాన కారణాలివే, ఈ సమస్యకు ఇలా చెక్ చెప్పొచ్చు

Hair Fall Reasons: ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్యలు ఎక్కువౌతున్నాయి. ఈ సమస్య ఎక్కువైతే బట్టతలకు దారితీయవచ్చు. కేశాలు రాలే సమస్యను పరిష్కరించాలంటే ముందు ఈ సమస్యకు మూలం ఎక్కడనేది తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2023, 07:29 PM IST
Hair Fall Reasons: జుట్టు రాలే సమస్యకు 5 ప్రధాన కారణాలివే, ఈ సమస్యకు ఇలా చెక్ చెప్పొచ్చు

Hair Fall Reasons: ఆధునిక జీవన విధానంలో కేశాలు రాలడం చాలా సాధారణంగా మారిపోయింది. జుట్టు పల్చబడి రాలిపోవడం జరుగుతుంటోంది. ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే బెడ్‌పై చిందరవందరగా రాలిన జుట్టు చూస్తే పరిస్థితి తీవ్రత అర్ధమౌతుంటుంది. కచ్చితంగా ఈ పరిస్థితి బట్టతలకు దారితీస్తుందేమోననే సందేహం వేధిస్తోంది. అసలు జుట్టు రాలడానికి అతి ముఖ్యమైన 5 కారణాలు ఇవే. 

ఆటో ఇమ్యూన్ డిసీజ్

వివిధ రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధుల్ని ఎదుర్కొంటుంటే ఆ ప్రభావం కచ్చితంగా కేశాల ఎదుగుదలపై పడుతుంటుంది. కేశాల పటిష్టత కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

పోషకాల లోపం

కేశాల్లో విటమిన్ ఇ, విటమిన్ డి, ప్రోటీన్లు సహా చాలా రకాల పోషకాలు తప్పకుండా కావల్సి ఉంటుంది. ఈ పోషకాలు లోపించడం వల్లే జుట్టు రాలుతుంటుంది.

హార్మోన్ అసమతుల్యత

కొంతమంది హైపో థైరాయిడిజమ్ అంటే థైరాయిడ్ లోపంతో బాధపడుతుంటారు. దీంతోపాటు చాలామంది మహిళలు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉంటే జుట్టు బలహీనమైపోతుంటుంది.

కెమికల్ - హీట్ ట్రీట్‌మెంట్

ఇటీవలి కాలంలో కేశాల్ని అత్యంత సుందరంగా, ఎట్రాక్టివ్‌గా ఉంచేందుకు కెమికల్ ఆధారిత ప్రొడక్ట్ , హీట్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటారు. ఈ పద్ధతి తాత్కాలికంగా ప్రయోజనంగా ఉంటుంది గానీ, దీర్ఘకాలికంగా నష్టం ఏర్పడుతుంది. 

హార్మోనల్ మార్పులు

మహిళలు సాధారణంగా ప్రెగ్నెన్సీ సందర్భంగా చాలా వరకూ హార్మోనల్ మార్పులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు జుట్టు రాలుతుంటుంది. 

జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేశాల సంరక్షణకు కావల్సింది ఐరన్. దీనికోసం ఆకుపచ్చని కూరగాయలు, సీడ్స్, నట్స్ చాలా అవసరం. ప్రోటీన్లు కోసం చికెన్, సీఫుడ్స్, పప్పు, సోయాబీన్ తినాల్సి ఉంటుంది. విటమిన్ ఇ కోసం సన్ ఫ్లవర్ సీడ్స్, గుడ్లు, అవకాడో సేవించాల్సి ఉంటుంది. 

కేశాలకు విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి పొందాలంటే ఉదయం వేళ కాస్సేపు ఎండలో కూర్చోవాలి. దీనివల్ల కేశాలకు బలం కలుగుతుంది. 

Also read: Dragon Fruit: రోజూ ఈ ఫ్రూట్ తింటే కేన్సర్ సహా అన్ని రోగాలు మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News