/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Health benefits of Jamun fruit: మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. అంటే సమయానికి హెల్తీ పుడ్ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం వంటివి చేయాలి. మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా పైబర్, పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్ లో ఎక్కువగా మామిడి, వాటర్ మిలాన్, నేరేడు పళ్లు ఎక్కువగా లభిస్తాయి. నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పళ్లు ఎక్కవగా మే, జూన్ నెలలో అందుబాటులోకి వస్తాయి. దీనికి కొన్ని రోగాలను అరికట్టే గుణం ఉంది. ఇది పోషకాల గని అనే చెప్పాలి. నేరేడు పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. 

నేరేడు పండు తినడం వల్ల లాభాలు
** నేరేడు పళ్లు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
** నేరేడు దివ్యౌషధమనే చెప్పాలి. దీనినీ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 
** నేరేడు పండులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను, మెదడను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
** మూత్ర సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో నేరేడు పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. 
**  ఇందులో విటమిన్ సి మరియు ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో మీ శరీరంలోని హిమోగ్లోబిన్ కౌంట్‌ పెరుగుతుంది. మీ రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది. 
** నేరేడు మీ చర్మంపై ఉన్న మెుటిమలతోపాటు జిడ్డును కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మానికి నిగారింపును ఇస్తుంది. 
**  నేరేడులో విటమిన్ ఎ, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ కంటి పనితీరును మెరుగుపరచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. 
** జామూన్ ఫ్రూట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చిగుళ్లు, దంతాల నుండి రక్తం కారకుండా అరికడుతుంది. అంతేకాకుండా వాటిని గట్టి పరుస్తుంది. 
** నేరేడు డయాబెటిక్ రోగులకు వరమనె చెప్పాలి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
** కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. నేరేడు తినడం వల్ల జిగట విరేచనాలు కూడా దూరముతాయి. 

Also Read: Skin Care Tips: రాత్రి వేళ పాలతో ఫేషియల్, ఉదయం లేవగానే మిళమిళలాడటం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health tips: Incredible health benefits of eating Jamun or Black Plum fruit
News Source: 
Home Title: 

నేరేడుతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Jamun Health Benefits: నేరేడుతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Caption: 
File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నేరేడుతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, June 13, 2023 - 11:52
Request Count: 
53
Is Breaking News: 
No
Word Count: 
266