How Pumpkin Seeds Can Benefit Men's Health: గుమ్మడికాయ గింజలు వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లుతోపాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తిడి దూరమయ్యి..నిద్ర బాగా పడుతుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధమనే చెప్పాలి. గుమ్మడి గింజల ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజల ప్రయోజనాలు
** గుమ్మడి గింజలు తినడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి.
** బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** ఉదర సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది.
** మీ శరీరంలో రక్తానికి లోటు ఉండదు.
** మూత్ర విసర్జన, యూటీఐ వంటి సమస్యలను దూరం చేస్తుంది
** రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
** బీపీని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
** గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది, దీంతో మీ స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.
ఏ సమయంలో తినాలి?
మీరు గుమ్మడి గింజలను అల్పాహారంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు పడుకునే ముందు కూడా వీటిని తినవచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read; Uric Acid: కేవలం రూ.2తో యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook