Chocolate Modak Recipe in Telugu: వినాయక చవితి అంటే అందరికీ గుర్తుకు వచ్చే నైవేద్యాలు మోదకాలు. గణేష్ నవరాత్రుల్లో వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇది ఒకటి. నవరాత్రల్లో మొదటి రోజు చవితిన స్వామివారికి వీటిని నైవేద్యంగా సమర్పస్తారు. అయితే ఈ మోదకాలను వివిధ ప్రాంతాల వారు పలు రకాలుగా తయారు చేస్తారు. చాలా మంది దక్షిణ భారత దేశంలో మోదకాలను ఎక్కువగా వినాయకుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మందికి వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. ఈ మోదకాలను సులభంగా తయారు చేసుకోవడానికి చాలా చిట్కాలున్నాయి. ముఖ్యంగా చాలా మంది చాక్లెట్ మోదకాలను తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ మోదకాలను ఇలా తయారు చేసుకోవచ్చు:
చాక్లెట్ మోదక్ చేయడానికి.. ముందుగా పాలకోవాను సిద్ధం చేసుకోండి.. వీటిని ఓ బౌల్ వేసి మీడియం ఫేమ్ మీద వేయించాలి. కేవలం ఈ కోవాలను తక్కువ మంటపైనే వేడి చేయాలి. లేకపోతే చేదుగా మారే అవకాశాలున్నాయి. వీటిలో ఇప్పుడు కొంచెం పంచదారను అందులో వేయాలి. అంతేకాకుండా రంగకోసం వీటిలో ఫుడ్ కలర్స్ కూడా వాడు కోవచ్చు. అయితే చివరన చాక్లెట్ లేదా కోకో పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసి అందులో పాలను వేసి బాగా కలుపు కోవాలి. ఈ తర్వాత వీటిని మోదకాల అచ్చులో వేసి.. ఫైన్‌గా స్ట్రీమ్ చేసుకోవాలి. ఇలా చేసిన వాటిని గణేషుడికి నైవేద్యంగా కూడా సమర్పంచవచ్చు.
తయారీ తరువాత ఇలా చేయండి:
మోదకాలు భాగాల వేడి చల్లారిన తర్వాత వీటిపై కొంత నెయ్యిని అద్దాలి. అయితే వీటిపై చాక్లెట్ చిప్స్‌ను అలంకరించాలి. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు అందుతాయి. ముఖ్యంగా వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెడితే.. మంచిదని శాస్త్రం పేర్కొంది.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook