Geezer Safety Tips: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శీతాకాలం ఆరంభంలోనే తీవ్రస్థాయిలో చలి పెరుగుతోంది. చలితో వణికిపోతున్న ప్రజలు స్నానం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో స్నానం కోసం గీజర్‌ను వినియోగిస్తుంటారు. అయితే గీజర్ వినియోగం అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంది. లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. గీజర్ వినియోగంలో అజాగ్రత్తగా వహిస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
Also Read: Tomato Soup: హోటల్ స్టైల్ టమాటో సూప్ ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!
గీజర్ వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ మృతిచెందింది. పెళ్లయిన 5వ రోజు గీజర్ పేలడంతో వధువు ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో గీజర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. గీజర్‌లో మృతి చెందిన మహిళ పెళ్లికి 5 రోజుల ముందు అత్తగారింటికి వచ్చింది. గీజర్ పేలడంతో మహిళను ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించింది.
Also Read: Mushroom Biryani: ఘుమఘుమలాడే పుట్టగొడుగుల పులావ్.. తయారీ విధానం ఇలా!
ఇలాంటి ప్రమాదం సంభవించకుండా గీజర్ వినియోగంలో ఈ చిట్కాలు పాటించండి. సురక్షితంగా ఉంటారు. గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు.. వినియోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.
గీజర్ ఉపయోగాలు
- గీజర్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు వాడాల్సి ఉంది. డబ్బు ఆదా చేయడానికి స్థానిక కంపెనీ నుంచి గీజర్ కొనకండి. చౌకైన గీజర్లలో నాణ్యత, ఫీచర్లు తరచుగా నాణ్యత కోల్పోతాయి.
- గీజర్‌ను ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచవద్దు. ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే అది వేడెక్కడం, పేలుడుకు కారణం కావచ్చు.
- గీజర్‌లో ప్రెషర్ ఎక్కువ అయితే ఆ ఒత్తిడిని విడుదల చేయడానికి గీజర్‌లో వాల్వ్ ఉంచారో లేదో తనిఖీ చేయండి. వాల్వ్‌లో ఏదైనా లోపం ఉంటే పేలుడు సంభవించవచ్చు. లేకపోతే లీకేజీకి అవకాశం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి.
- గీజర్ పాతదైతే మీరు దాని థర్మోస్టాట్‌ను తనిఖీ చేయాలి. థర్మోస్టాట్ తప్పుగా ఉంటే గీజర్ ఎంత నీటిని వేడి చేయాలో చెప్పదు. నిరంతర వేడి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఏదో ఒక సమయంలో అది పగిలిపోతుంది.
- స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ గీజర్ ఉపయోగించకూడదు. ఈ రోజుల్లో గీజర్లు హెవీ వాటర్ కెపాసిటీతో వస్తుండడంతో స్నానం చేసే ముందు నీటిని వేడి చేసి నిల్వ చేసి గీజర్ ఆఫ్ చేయాలి. దీని వలన ఎలాంటి ప్రమాదం సంభవించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి