Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా... అయితే ఇది మీ కోసమే..!

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు రావడం మొదలైతే.. అది ముఖ సౌందర్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చాలా దీని కారణంగా చాలా మంది ముఖాలు అందహీనంగా తయారవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 03:59 PM IST
  • కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా..
  • టమాటో, బేసన్ పేస్ట్‌తో ఉపశమనం పొందండి
  • చర్మాన్ని కాంతి వంతంగా మారుతుంది
Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా... అయితే ఇది మీ కోసమే..!

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు రావడం మొదలైతే.. అది ముఖ సౌందర్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చాలా దీని కారణంగా చాలా మంది ముఖాలు అందహీనంగా తయారవుతున్నాయి. ఈ కళ్ల కింద నల్లటి వలయాలని ప్రధాన కారణం నిద్ర లేకపోవడం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, డీహైడ్రేషన్ కారణంగా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి చాలా మర్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఈ  నల్లటి వలయాలను తొలగించేందుకు  అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న చిట్కాలను మనం తెలుసుకుందాం..

ఈ వలయాలను ఇలా తొలగించుకోండి:

టమాటో, బేసన్ పేస్ట్:

టమాటో పేస్ట్ కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని నిపునులు తెలుపుతున్నారు. దీని కోసం.. మిక్సర్ గ్రైండర్‌లో పెద్ద టమోటాను గ్రైండ్ చేసి.. ఆపై శెనగపిండి, నిమ్మరసం వేసి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను కళ్ల కింద పాటు అప్లై చేసి.. ఇరవై నిమిషాల పాటు ఉంచండి. చివరకు శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగండి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే నల్లటి వలయాలు పూర్తిగా పోతాయి.

పుదీనా ఆకుల పేస్ట్:

ఇందుకోసం పచ్చి పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి కంటి నల్లటి వలయాలపై అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. చివరగా.. చల్లటి నీరులో కాటన్ క్లాత్‌ను ముంచి పేస్ట్‌ను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోవడమే కాకుండా కళ్లకు ఉపశమనం లభిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్, గ్లిజరిన్:

ముఖాన్ని తేమగా మార్చడానికి గ్లిజరిన్ ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు.. కానీ గ్లిజరిన్‌ను నారింజ రసంలో కలిపి కళ్ల కింద రాసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయని తెలియదు. దీనిని క్రమం తప్పకుంగా కంటి చుట్టు రాసుకుంటే చర్మం మెరుగుపడడమే కాకుండా నల్ల మచ్చలు తొలగిపోతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!

Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News