Chest Pain Due To Gas: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న పొట్ట సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. తినే క్రమంలో నోటికి రుచి కలిగించే అనేక రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ఆ తర్వాత పొట్టలో గ్యాస్ మలబద్ధకం సమస్య బారిన పడుతూ ఉంటారు. ఈ గ్యాస్ కారణంగా రోజంతా ఏ పని సక్రమంగా చేయలేకపోతుంటారు. దీంతోపాటు కొంతమందిలో ఛాతి, పొట్ట నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొంతమందిలో ఈ గ్యాస్ సమస్య పొట్టలోని ప్రేగుల్లో మలం స్తంభించిపోయి కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కారణంగానే కొంతమందిలో ఛాతిలో విపరీతంగా పెరుగుతోంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని అలవాట్లను తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలామందిలో పొట్టలోని పేగుల్లో మలం శుభ్రం లేకపోవడం కారణంగా గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇది పేగుల్లో నుంచి బయటికి వెళ్లడానికి తప్పకుండా ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కొంతమంది అల్పాహారం తిన్న తర్వాత ఈ గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు శాశ్వతంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతిరోజు లీటర్ గోరువెచ్చని నీటిని ఉదయం పూట తాగాల్సి ఉంటుంది.
కొంతమందిలో మనం పేగుల్లో ఇరుక్కుపోయి జీర్ణ క్రియ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా సిట్రీస్ అధిక పరిమాణంలో లభించే పండ్లను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో పాటు ఆహారాలను రోజుకు మూడుసార్లు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Yoga Benefits: ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
అంతేకాకుండా చాలామంది ఆహారాలు తీసుకునే క్రమంలోనే నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆహారాలు తీసుకునే క్రమంలో నీటిని తాగకపోవడం చాలా మంచిదని వారంటున్నారు. ఆహారాలు తీసుకున్న తర్వాత 15 నిమిషాలు ఆగి నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తరచుగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి తినే ఆహారాలను కేవలం సాయంత్రం 7లోపే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది
Also read: Sabja Seeds: సబ్జా గింజలతో కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter