Bloating Remedies: ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్యకరమైన తినే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీని కారణంగా కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మలబద్ధకం, గ్యాస్ వంటి పొట్ట సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కడుపులో గ్యాస్ ఏర్పడడం వల్ల పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిండుగా ఉండడం వల్ల చాలామంది సరైన సమయాల్లో ఆహారాలు తీసుకోలేకపోతున్నారు దీని కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది ఎక్కువగా వేయించిన స్పైసీ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య కారణంగా రోజూ చేసే పనుల్లో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతమందిలో దీని కారణంగా పొత్తికడుపు నొప్పి కూడా వస్తోంది. మరి కొంతమందిలో ఆకలి కూడా ఒక్కసారిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నప్పటికీ జీర్ణ క్రియ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఉదయం పూట 30 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్కువగా కష్టపడనక్కర్లేదు ముందుగా 10 నుంచి 15 నిమిషాల వరకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో 10 నుంచి 15 నిమిషాల వరకు హాండ్స్ ని ఊపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలే కాకుండా బరువు తగ్గడం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యోగా చేయడం వల్ల గొప్ప ఉపశమనం పొందవచ్చు. దీనికోసం అతిగా కష్టపడిన అక్కర్లేదు ప్రతిరోజు బలానాసనం చేయడం వల్ల అతి సులభంగా ఈ గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. దీంతోపాటు కొత్తిమీర జీలకర్రను ఇదిలో నానబెట్టి గ్రైండ్ చేసి తాగడం వల్ల మరింత సులభంగా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు తిన్న తర్వాత అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా 20 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. ఇలా నడవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఎక్కువగా సోంపును నమిలి తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter