Black Circles Under Eye: కళ్ల కింద క్యారీ బ్యాగులకు ఇలా 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Black Circles Under Eye: చాలా మందిలో కంటి వలయాల సమస్యల సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి చాలు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 04:59 PM IST
Black Circles Under Eye: కళ్ల కింద క్యారీ బ్యాగులకు ఇలా 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Black Circles Under Eye: ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు వారి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే వలయాలు మరింత నల్లగా మారే ఛాన్స్‌ ఉంది. దీంతో ముఖం కూడా అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటిస్తే కళ్ల కింద క్యారీ బ్యాగులు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి పాలు:
కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పచ్చి పాలను కళ్ల కింద అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా ఆప్లై చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారని చర్మ సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు.
 
 చల్లని గ్రీన్ టీ:
చాలా మంది అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని  గ్రీన్ టీ తాగుతున్నారు. అవును గ్రీన్‌ టీ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా గ్రీన్ టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో ముంచి..ఆ నీటిని పిండి కళ్ల దగ్గర పెట్టుకుంటే వలయాల సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

దోసకాయను ముక్కలు:
దోసకాయను ముక్కలు కూడా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే వీటిని ముక్కల్లా కోసి కళ్ళపై 10 నిమిషాలు ఉంచండి. ఇలా పది రోజుల పాటు చేస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కళ్ల సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.

టమోటా రసం:
టమోటా రసంలో ఉండే గుణాలు కూడా కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడతాయి. అయితే దీని కోసం 2 టీస్పూన్ల టమోటా రసంలో 5 చుక్కల నిమ్మరసం కలపండి. ఈ ఇలా కలిపిన మిశ్రమాన్ని  కళ్ల కింద 10 నిమిషాలు పట్టించి.. నీటితో శుభ్రం చేసుకోండి.. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

 

Trending News