Better Digestion foods: మనం తిన్న వెంటనే అజీర్తి, మలబద్ధకం సమస్యతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అతిగా కారం ఉండే మసాలాలు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇష్టమైన ఆహారం తిన్న ఎలాంటి కడుపు సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ తాగాల్సిందే..ప్రతిరోజు ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు ఉండవు మలబద్దకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు రావు మంచి పేగు ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఈ డ్రింక్ తాగడంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది ఇది మంచి జీర్ణక్రియకు తోడ్పడుతాయి.
నీళ్లు..
తినేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా ఆహారం తిన్న ఒక రెండు నిమిషాలు తర్వాత ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవటం వల్ల మంచి జీర్ణక్రియకు ఉపకరిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మంచి జీర్ణ ఆరోగ్యానికి సహకరిస్తుంది నీటిని ఎక్కువగా తీసుకోలేని వారు అందులో కనీసం ఒక అర చెక్క నిమ్మరసం కలుపుకొని తాగాలి.
నిమ్మరసం..
అతిగా ఆహారం తిన్నా లేకపోతే ఏదైనా మసాలాలు ఉన్న ఆహారం తీసుకున్న వెంటనే నిమ్మరసం తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగ పడుతుంది. ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సీ ఉంటుంది. ఇది మంచి సిట్రస్ పండు. కడుపు సమస్యలకు ఇది సరైన మందు.
కొంబుచా..
కొంబుచా మంచి బయోటిక్ ఇది పెగు ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. కడుపు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గట్ హెల్త్ ని పేగు కదలికలకు తోడ్పడి జీర్ణక్రియకు సహకరిస్తాయి. కొంబుచా టీ తయారు చేసుకుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈ ఒక్క టీ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు..
అల్లం వాటర్..
అల్లం నీటిని తీసుకోవటం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మినరల్స్ పోషకాలు ఉంటే మన జీవనక్రియకు సహకరిస్తుంది. ఇది వాపు సమస్యలు మంట సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అల్లం గ్యాస్ సమస్యలకు సరైన రెమిడీ.
ఇదీ చదవండి: పేగు ఆరోగ్యానికి 5 పండ్లు గ్యాస్ అజీర్తి జాడే ఉండదు..
మజ్జిగ..
లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి సహకరిస్తుంది. ఇందులో ఫ్యాట్ కూడా తక్కువగా ఉండటం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. మజ్జిగ ప్రోబయోటిక్ ఇందులో గుడ్ బ్యాక్టీరియా అని పెంచి జీర్ణ సమస్యలు రాకుండా నివారించి ఇది మలబద్ధకం అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి