Best Oil For Hair Growth: ఒత్తైన, పొడవాటి జుట్టు రహస్యం..ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఈ రెమెడీ దొరకదు!

Best Oil For Hair Growth And Thickness: జుట్టు రాలడం వల్ల సన్నని జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ రెండు నూనెలను ప్రతి రోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు దృఢంగా తయారవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2023, 05:05 PM IST
Best Oil For Hair Growth: ఒత్తైన, పొడవాటి జుట్టు రహస్యం..ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఈ రెమెడీ దొరకదు!

Best Oil For Hair Growth And Thickness: అమ్మాయిల అందానికి రహస్యం ఒత్తైన, పొడవాటి జుట్టని అందరికీ తెలిసిందే..ఒత్తైన జుట్టులేని వారి ముఖం చూసేందుకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు రాలిపోతుంది. చివరి జుట్టు పల్చగా తయారవుతోంది. దీని కారణంగానే చాలా మంది మహిళల ముఖం అందహీనంగా తయారవుతోందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ప్రారంభంలోనే పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే జుట్టును బలంగా, ఒత్తుగా చేసుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే పలు రకాల ఖరీదైన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద వైద్యులు సూచించిన ఇంట్లో తయారుచేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్‌ను వినియోగించడం వల్ల మంచి జుట్టును పొందుతారు. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుంది.

ఉల్లిపాయ నూనె:
ఉల్లి నూనె జుట్టుకు ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నూనెలో దాగి ఉన్న గుణాలు జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు జుట్టును దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ నూనెలు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. వీటికి బదులుగా ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోండి. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

ఉల్లిపాయ నూనె తయారీ విధానం:
❁ ముందుగా మీరు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్‌ చేయాల్సి ఉంటుంది.
❁ ఆ తర్వాత వీటిని మిక్సీలో గ్రైండ్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. 
❁ ఇలా చేసిన తర్వాత ఒక కప్పు నూనె తీసుకుని..ఒక బౌల్‌లో పోసుకుని గ్యాస్‌స్టౌవ్‌పై పెట్టాల్సి ఉంటుంది.
❁ ఇలా పెట్టిన తర్వాత అందులో పై మిశ్రమాలు వేసుకుని.. 5 నుంచి 10 నిమిషాల పాటు తక్కువ మంటపై బాగా మరిగించాలి.
❁ మరిగించిన తర్వాత నూనెను ఫిల్టర్‌ చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. 

కరివేపాకు, మెంతి గింజల నూనె:
జుట్టును దృఢంగా చేసేందుకు కరివేపాకు, మెంతి గింజల నూనె కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును  ఒత్తుగా, పొడవుగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి. మీరు కూడా జుట్టు సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ నూనెను ట్రై చేయండి.

ఈ నూనె తయారీ పద్ధతి:
❁ ఈ నూనె తయారీ చేయడానికి ముందుగా మెంతి గింజలు, కరివేపాకులను మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
❁ ఇలా తయారు చేసుకున్న తర్వాత బాణలిలో ఆలివ్ నూనెను వేసుకుని స్టౌవ్‌పై పెట్టుకోవాలి.
❁ ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఆలివ్ నూనెలో పై మిశ్రమాలు వేసి బాగా మరిగించుకోవాలి.
❁ ఆ తర్వాత చల్లార్చి జాడీలో ఫిల్టర్ చేసి భద్ర పరుచుకోవాలి.
❁ ఈ నూనెను వారానికి 2-3 సార్లు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా తయారవుతుంది. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News