Amitabh Bachchan Diet Plan: అమితాబ్ బచ్చన్ అంత ఫిట్‌గా ఉండడానికి ప్రధాన కారణాలు ఇవేనా..?

Amitabh Bachchan Diet Plan: అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజూ సందర్భంగా ఆయిన అనుసరించే డైట్‌ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన  ప్రతి రోజూ ఆహారంలో భాగంగా గుడ్డు బుర్జి, బాదం, ప్రోటీన్ డ్రింక్  తీసుకునేవారని సమాచారం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాలు కూడా చేసేవారట..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 12:34 PM IST
  • అమితాబ్ బచ్చన్ ఫిట్‌ ఉండడానికి..
  • ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తినేవారట.
  • డిన్నర్‌లో భాగంగా పనీర్ భుర్జీ తినేవారు.
Amitabh Bachchan Diet Plan: అమితాబ్ బచ్చన్ అంత ఫిట్‌గా ఉండడానికి ప్రధాన కారణాలు ఇవేనా..?

Amitabh Bachchan Fitness Secret: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన  50 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ లో చిత్ర పరిశ్రమలో పని చేసారు. ప్రస్తుతం కూడా ఆయన ప్రముఖ షోలకు హోస్ట్‌గా పని చేస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ షో అయిన  'కౌన్ బనేగా కరోడ్‌పతి' షో ద్వారా ఎంతో జనాదరణ సంపాదించుకున్నారు. అయితే ఆయన ఇప్పటికీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఫిట్‌గా ఉండడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారని తెలుస్తోంది.  ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ తనను తాను ఎలా ఫిట్‌గా ఉంచుకుంటున్నారో తెలుసా..? అయితే ఆయన ఫిట్‌గా ఉండడానికి ప్రధాన కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

ఆయన జీవితంలో చాలా కష్టపడ్డారు:
బిగ్ బి తన జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. అంతేకాకుండా ఇదే క్రమంలో అమితాబ్ బచ్చన్ TB, లివర్ సిర్రోసిస్ వంటి పెద్ద వ్యాధులను కూడా ఎదుర్కొన్నారు. లివర్ సిర్రోసిస్ కారణంగా అతని కాలేయం 75 శాతం వరకు పాడైపోయింది. అయినప్పటికీ చికిత్స పొంది. ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అంతేకాకుండా 2019  ఆయనకు కోవిడ్‌ కూడా వచ్చింది. వీటికి ఏ మాత్రం భయపడకుండా తను ఫిట్‌నెస్‌గా ఉండడానికి ప్రతి రోజూ వ్యాయామాలు చేశారు. అంతేకాకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకునేవారు.  

సిగరెట్, మద్యానికి దూరం:
బిగ్ బి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవారు. ఆయన సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండేవారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్  తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వర్కవుట్స్, యోగాలు చేసేవారు. అయిన ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామాలు చేసేవారు. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారాలను తీసుకునేవారని తెలుస్తోంది.

ఆహారంలో వీటిని తీసుకునేవారు:
అమితాబ్ బచ్చన్ ఆహారంలో సాధారణమైన వాటిని తినడానికి ఇష్టపడతారు. వ్యాయామాలు, యోగా చేసే క్రమంలో కేవలం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకునేవారు. ఆయన ఉదయం పూట పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినేవారట. ముఖ్యంగా  బచ్చన్ ఆహారంలో భాగంగా గంజి, గుడ్డు బుర్జి, బాదం, ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటారని సమాచారం. అల్పాహారం తర్వాత ఫిట్‌గా ఉండడానికి తులసి ఆకులు, ఉసిరి రసం, కొబ్బరి నీరు తీసుకునేవారు. పగలు ఆహారంలో పప్పులు, కూరగాయలు, రోటీలు తీసుకునేవారని తెలుస్తోంది. డిన్నర్‌లో భాగంగా పనీర్ భుర్జీ లేదా సూప్ తీసుకుంటారట. అంతేకాకుండా క్రమం తప్పకుండా తనకు ఇష్టమైన బెంగాలీ స్వీట్స్‌ తీసుకుంటారని సమాచారం..

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

AlsoRead: ShareMarket: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News