Aloe Vera Benefits: వాతావరణం కాలుష్యం, పోషకాహార లోపం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు సమస్యలు వస్తాయి. శరీరంలో పోషకాలు తగ్గడం వల్ల ప్రస్తుతం చాలా మందిలో జుట్టు బలహీనంగా మరడమేకాకుండా క్రమంగా రాలిపోవడం సమస్యలు ఎక్కువతున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వారిలో ప్రీమెచ్యూర్ వైట్నింగ్ కూడా రావడం మొదలవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలతో పాటు ఇంటి చిట్కాలను పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ హోం రెమెడీస్‌తో జుట్టు ఒత్తుగా తయారు కావడమేకాకుండా మృదువుగా తయారవుతుంది. కాబట్టి జుట్టు కలబందను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబందను జుట్టు ఎలా అప్లై చేయాలో తెలుసా?
అలోవెరా, కొబ్బరి నూనె:
అలోవెరా, కొబ్బరి నూనెను కలిపి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు కూడా సులభంగా నల్లగా తయారవుతుంది. అయితే ఈ రెండు మిశ్రమాలను ప్రతి రోజూ అప్లై చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
కలబంద జుట్టు హెర్ మాస్క్:
కలబంద జెల్‌తో హెర్ మాస్క్‌ను తయారు చేసి జుట్టుకు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత మంచి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అలోవెరా స్ప్రే:
జుట్టు ధృడత్వానికి అలోవెరా స్ప్రే ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు కాలుష్యం నుంచి కూడా సంరక్షించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి