Tips for Working From Home: ఇంటి వద్ద నుంచి జాబ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ మీ కోసమే!

Tips for Working From Home: టార్గెట్ పూర్తి చేయాలని కుర్చీలకే అతుక్కుపోతే.. వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు, క్రిములు మిమ్మల్ని టార్గెట్ చేస్తాయని మరిచిపోవద్దు. విరామం తీసుకుని పనిచేస్తే మీ ప్రదర్శన సైతం మెరుగవు ఉందని నిపుణుల సర్వేలలో సైతం తేలింది.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 24, 2020, 04:00 PM IST
  • కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు
  • పలు కంపెనీలు ఉద్యోగులను పని నుంచి తొలగించాయి
  • ఉగ్యోగం చేస్తుంటే ఈ చిట్కాలు పాటించడం చాలా బెటర్
Tips for Working From Home: ఇంటి వద్ద నుంచి జాబ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ మీ కోసమే!

Tips for Working From Home: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు కంపెనీలు మూతపడ్డాయి. కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే (Working From Home) అవకాశాన్ని కల్పించాయి. కానీ అది అనుకున్నంత సులువు మాత్రం కాదు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మానసిక నిపుణుల అభిప్రాయం. 

కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమయంలో నెల రోజులు, లేక రెండు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కొత్తదనంతో పాటు ఉద్యోగికి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు ఎలాగూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని గొడ్డు చాకిరి చేయిస్తుంటాయి. ఇలాంటి సంస్థల ఉద్యోగులు అటు కుటుంబానికి సమయాన్ని కేటాయించలేరు. ఇటు ఆఫీసులోనూ పరిస్థితి అంత బాగా ఏం ఉండదు. అందుకే వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు కొన్ని టిప్స్ పాటించాయి. 
Also Read: Relationship Tips: వారంలో ఆ ఒక్కరోజే ఎక్కువ బ్రేకప్స్ అవుతాయి..

ఆఫీసులో పనివేళలు 9 గంటలు అయితే సాధ్యమైనంత వరకు అదే సమయంలో పని పూర్తి చేసేందుకు యత్నించండి. లేకపోతే అధిక సమయం పనిచేస్తూ కూర్చుంటే అటు కుటుంబానికి సమయం కేటాయించడం సాధ్యపడదు. ఐదు నుంచి 10 నిమిషాలు విరామం తీసుకుంటే వెంటనే మీకు కంపెనీ అప్పగించిన పనిని పూర్తిచేయాలి. అలా చేస్తే మీ ఒత్తిడి తగ్గుంతుంది.  

Also Read: Food items in breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా ? అయితే రిస్కే..

అసలే కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అందులోనూ కొత్త రకం కరోనా వైరస్ మరింత వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆరోగ్యం (Health) పట్ల అశ్రద్ధ చేయవద్దు. పోషకాలు లభించే ఆహారాన్ని తింటే.. ఏ ఇబ్బంది లేకుండా మీ పనిని సులువుగా పూర్తి చేయవచ్చు. కరోనా లాంటి మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు.

Also Read: Interesting Facts About Moles: మచ్చలపై ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోండి. అంటే వీలును బట్టి రెండు గంటలకు ఒకసారి ఓ 10 నిమిషాలు మీ కంప్యూటర్ లేక ల్యాప్‌టాప్‌ను పక్కనపెట్టాలి. టార్గెట్ పూర్తి చేయాలని కుర్చీలకే అతుక్కుపోతే.. వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు, క్రిములు మిమ్మల్ని టార్గెట్ చేస్తాయని మరిచిపోవద్దు. విరామం తీసుకుని పనిచేస్తే మీ ప్రదర్శన సైతం మెరుగవు ఉందని నిపుణుల సర్వేలలో సైతం తేలింది.
Also Read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు

మీ కంపెనీలో పనిచేస్తున్న తోటి ఉద్యోగులతో పని విషయాలతో పాటు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే షేర్ చేసుకోవాలి. అప్పుడు మీ మనసు కాస్త తేలిక అయినట్లు ఉంటుంది. వారు తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తారు.

ఇంట్లో ఆఫీసు వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మీకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. మీరు పని చేస్తున్నారని గమనిస్తే,, మిమ్మల్ని పదే పదే పిలిచి ఇబ్బంది పెట్టడం లాంటివి జరగవు. అయితే మీకు ఏమైనా సందేహాలుంటే ఆఫీసుకు ఫోన్ చేసి తెలుసుకోవడం ఉత్తమం. 

Also Read: Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News