Tamilnadu: తమిళ చిన్నమ్మ శశికళ రాజకీయాల్నించి తప్పుకుంటున్న ప్రకటన సంచలనంగా మారింది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సింది పోయి..దూరంగా ఉంటాననడం వెనుక కీలక వ్యూహమే ఉంది. ఆ వ్యూహకర్త ఎవరో తెలుసా..
అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం బెంగళూరు జైలు నుంచి విడుదలై వచ్చిన తమిళ చిన్నమ్మ శశికళ (Sasikala) వస్తూ వస్తూనే సంచలనం రేపారు. ఏఐఏడీఎంకే (AIADMK) జెండా ఉన్న కారుతో ర్యాలీ నిర్వహించి ఒక్కసారిగా తిరుగుబాటు సంకేతాలు కూడా ఇచ్చారు. అటువంటిది ఒక్కసారిగా రాజకీయాల్నించే తప్పుకుంటున్నాని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. శశికళ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఈ వ్యూహాన్ని రచించింది బీజేపీ అగ్రనేతల్లో ఒకరని అర్ధమౌతోంది.
తమిళనాడు (Tamilnadu) అధికార పార్టీలో శశికళ వర్గానికి చెందిన నేతలెక్కువగా ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత జరిగిన పరిణామాల్లో ఏఐఏడీఎంకే నేతలు బీజేపీతో దగ్గరయ్యారు. అదే సమయంలో శశికళ విడుదలై పార్టీకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఆమెతో రాజీ వైఖరి అవలంభించాలని తొలుత బీజేపీ పెద్దలు కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే శశికళ అన్నాడీఎంకే కాకుండా వేరేపార్టీతో పోటీ చేస్తే చీలేవి అన్నాడీఎంకే ఓట్లే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగని ఏఐఏడీఎంకేలో చేర్చుకుంటే ఆమెపై ఉన్న అవినీతి మరక ప్రతిపక్షం డీఎంకేకు ప్రచారాస్త్రంగా మారుతుంది. ఈ నేపధ్యంలో ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ పెద్దలు ఒక్కసారిగా వ్యూహం మార్చారు. పార్టీకు..రాజకీయాలకు దూరంగా ఉంటే ఓటు బ్యాంకు చీలిపోకుండా భద్రంగా ఉంటుంది. అందుకే శశికళను బీజేపీ(BJP)అగ్రనేతలే ఈ నిర్ణయం తీసుకునేట్టు చేశారని తెలుస్తోంది.
ఏఐఏడీఎంకే(AIADMK) మరోసారి గెలిచే క్రమంలో భాగంగానే శశికళను కావాలని దూరం పెట్టినట్టు సమాచారం. లేకపోతే చాపకింద నీరులా డీఎంకే అధికారంలో వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించే శశికళను రాజకీయాల్నించి దూరం పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: Metro man sridharan: కేరళ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా శ్రీధరన్‌ను ప్రకటించిన బీజేపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook