Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అంతగా ప్రమాదకరం కాకపోయినా అంత ఆందోళన ఎందుకు. ఆ నిపుణులు చెబుతున్నట్టు నిజంగానే ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేమా. .ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ చుట్టేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఇది ప్రమాదకరం కాకపోయినా..సంక్రమణ మాత్రం అత్యంత వేగంగా ఉంటుంది. అందుకే ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతిని ఆపలేమని సాక్షాత్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు సంబంధించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జై ప్రకాశ్ ములియల్ అంటున్నారు. ఇదే ఇప్పుడు కలవరం రేపుతోంది.
ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) అనేది ఓ జలుబులా వస్తుంటుందని డాక్టర్ జై ప్రకాష్ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే సహజమైన రోగ నిరోధక శక్తి భారతీయుల్లో ఉండటం వల్ల..ఇతర దేశాల్లా మనం ప్రభావం కాలేదని కూడా చెప్పారు. వ్యాక్సినేషన్‌కు ముందే దేశంలో దాదాపు 85 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారని అంటున్నారు. వ్యాక్సిన్ అనేది ఎప్పుడూ సహజమైన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వజాలదని స్పష్టం చేశారు. ఏ కంపెనీకు చెందిన బూస్టర్ డోసులు కూడా కరోనా వైరస్ నుంచి కాపాడలేని కూడా తేల్చి చెప్పారు. బూస్టర్ డోసు అనేది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమేనన్నారు. అందుకే ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకున్నవారు కూడా ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డ ఘటనలు చాలా ఉన్నాయని డాక్టర్ జై ప్రకాష్ చెప్పారు. డెల్టా వేరియంట్‌తో(Delta Variant) పోలిస్తే ఒమిక్రాన్ సంక్రమణ చాలా రెట్లు అధికమన్నారు. ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నందున..సంక్రమణ చాలా వేగంగా ఉంటుందన్నారు.
Also read: Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి