ఇక వలసలు ఉండవ్..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది.  వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.

Last Updated : May 25, 2020, 01:57 PM IST
ఇక వలసలు ఉండవ్..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది.  వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు  ఎదుర్కున్న పరిస్థితి చూశాం. అసలు దేశవ్యాప్తంగా ఇంత మంది వలసకూలీలు ఉన్నారా..? అనే ఆశ్చర్యం కూడా కూడా  కలిగింది. అందులో ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ మంది వలస కూలీలు మిగతా రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లారు. ఐతే దీనిపై ఆలోచించిన యూపీ సర్కార.. వలస కార్మికులకు స్వరాష్ట్రంలోనే  పని కల్పించాలని నిర్ణయం తీసుకుంది. యూపీవాసులు మిగతా రాష్ట్రాల్లో అవమానాలు ఎదుర్కోవడంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక నుంచి ఏ రాష్ట్రానికైనా కార్మికులు వలస వెళ్లాలంటే .. యూపీ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేశారు.  

అంతేకాదు  వలస  కార్మికులను  గుర్తించి.. వారికి  పని కల్పించేందుకు చర్యలు  తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్  అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా మైగ్రేషన్ కమిషన్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. వారికి సామాజిక భద్రతతోపాటు బీమా కూడా  కల్పించాలని ఆదేశించారు.

 

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వేలాది వలస కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఇక వారిని యూపీ దాటి వెళ్లనిచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ లోనే వారికి నైపుణ్యత ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం చర్యలు  తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే 23 లక్షల మంది వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News