'కరోనా వైరస్' కారణంగా దాదాపు 2 నెలలకు పైగా లూప్ లైన్లకే పరిమితమైన రైళ్లు.. క్రమక్రమంగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు, సాధారణ ప్రయాణీకుల కోసం పరిమిత సంఖ్యలో రైల్వే సర్వీసులు నడిపిస్తున్న రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా ఆర్ధికంగా బాగా చితికిపోయాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. మాకు కేంద్రం నుంచి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఇదీ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ.
లాక్ డౌన్ 5.0 రేపటి నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకోనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు నెలల తర్వాత కూడా పాజిటివ్ కేసుల ఉద్ధృతి తగ్గడం లేదు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఓవైపు 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో లాక్ డౌన్‌కు సడలింపులు ఇచ్చారు.పాక్షికంగా ఆంక్షలు తొలగించి మళ్లీ జీవిత చట్రాన్ని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
భారత దేశంలో 'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు నమోదవుతున్న తీరు చూస్తే... ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు, వలస కార్మికుల తరలింపు, విదేశాల నుంచి వస్తున్న భారతీయులు, స్వదేశీ విమానయానం పునరుద్ధరణ, రైల్వే సర్వీసుల పునః ప్రారంభం తర్వాత రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనీ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధికంగా, సామాజికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కుంటున్న అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO పనితీరుపై ఇప్పటికే గుర్రుగా ఉంది. కరోనా వైరస్ పుట్టిల్లు చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ.. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గురించి హెచ్చరించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది.
'కరోనా వైరస్' ఎలా పుట్టింది..? వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా..? జంతువుల్లోనే జన్మించిందా..? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ తలెత్తుతున్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ ఒక్క దానికి కూడా సమాధానం దొరకడం లేదు.
'కరోనా వైరస్' దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఆర్ధికంగా చితికిపోయారు. తెలుగు సినీ, టీవీ పరిశ్రమలోనూ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐతే వారిని ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ తలసాని ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'కరోనా వైరస్' మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే దేశ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ధనిక, పేద, ఆడ,మగ, పిల్లలు, పెద్దలు అనే తేడాలేవీ లేకుండా అందరినీ కబళిస్తోంది. అందరికీ కరోనా మహమ్మారితో భయం ఉంది.
మహారాష్ట్రలో 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. కేవలం 14 రోజుల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉంది.
'కరోనా వైరస్' రోజూ వందల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఉంది. చైనా మహమ్మారి దెబ్బకు రోజూ భారత దేశంలో 150కి పైగానే జనం మృత్యుకౌగిట చిక్కుకుంటున్నారు.
'కరోనా వైరస్'ను ఎదుర్కోవడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది. వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఐతే ఓ రకంగా చెప్పాలంటే.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే..కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే కారణం.
'కరోనా వైరస్' భూతం జడలు విప్పుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు కొత్త రికార్డులకు తెరతీస్తున్నాయి.
రేపటి నుంచి మళ్లీ గగనయానం పునఃప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నేలకే పరిమితమైన గగన విహంగాలు.. మళ్లీ రేపటి నుంచి నింగిలోకి ఎగరబోతున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో జంతువులు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో నడి రోడ్డుపై చిరుత దర్శనమిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.