UP Polls 2022: యూపీ సెంట్రల్ రీజియన్‌లో బీజేపీదే ఆధిపత్యం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..

UP Opinion Polls: గత 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ... సర్వేలు మాత్రం బీజేపీకి తిరుగులేదని చెబుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 11:08 PM IST
  • యూపీ సెంట్రల్ రీజియన్‌లో బీజేపీదే ఆధిపత్యం
  • దాదాపు 47 సీట్లలో గెలుపొందే అవకాశం
  • ఎస్పీకి దాదాపు 16 నుంచి 20 స్థానాలు
  • జీ న్యూస్, డిజైన్‌ బాక్స్డ్ సర్వేలో వెల్లడి
UP Polls 2022: యూపీ సెంట్రల్ రీజియన్‌లో బీజేపీదే ఆధిపత్యం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..

UP Opinion Polls: కేంద్రంలో అధికారానికి యూపీ (Uttar Pradesh) దగ్గరి దారి అని విశ్లేషకులు చెబుతుంటారు. యూపీలో దాదాపు 80 లోక్‌సభ స్థానాలు ఉండటమే ఇందుకు కారణం. అందుకే యూపీలో ఎన్నికలంటే దేశం మొత్తం అటువైపు చూస్తుంది. త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్కడి రాజకీయాల గురించే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీకే లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జీ న్యూస్, డిజైన్‌బాక్స్డ్ సంయుక్తంగా నిర్వహించిన మెగా సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

జీ న్యూస్ (Zee News), డిజైన్‌ బాక్స్డ్ (Designed Box) సర్వే ప్రకారం... ఉత్తరప్రదేశ్ సెంట్రల్ రీజియన్‌లో మొత్తం 67 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ఇందులో 47-49 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. సమాజ్‌వాదీ పార్టీ 16-20 స్థానాలు దక్కించుకోనుంది. కాంగ్రెస్ ఒకటి లేదా రెండు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉండగా.. బహుజన్ సమాజ్ పార్టీ అసలు ఖాతా తెరవడమే కష్టంగా కనిపిస్తోంది. 

గత 2015 అసెంబ్లీ ఎన్నికలతో (UP Assembly Election) పోలిస్తే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ... సర్వేలు మాత్రం బీజేపీకి తిరుగులేదని చెబుతున్నాయి. ఎన్నికల ముంగిట్లో బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎస్పీ నుంచి ములాయం కోడలు అపర్ణ యాదవ్ కాషాయ పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామాలు ఎన్నికలపై ఎంతమేర ప్రభావం చూపగలుగుతాయో చూడాలి.

ఇప్పటికైతే అటు బీజేపీ, ఇటు ఎస్పీ ఇరు పార్టీలు తమదంటే తమదే గెలుపనే ధీమాతో ఉన్నాయి. ఇక పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభావం ఈ ఎన్నికల్లో అంతంత మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆ పార్టీ చీల్చే ఓట్ల పైనే బీజేపీ (Uttar Pradesh BJP), ఎస్పీల విజయావకాశాలు ఆధారపడి ఉండొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Omicron Survival: ఒమిక్రాన్ మనుగడ.. మనిషి చర్మంపై 21 గంటలు, ప్లాస్టిక్‌పై 8 రోజులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News